అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Shyama Prasad Mukherjee | దేశ సమగ్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
Shyama Prasad Mukherjee | జాతి ఐక్యత కోసం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Dhanpal) మాట్లాడుతూ.. జాతి ఐక్యత కోసం ఒక దేశం, ఒక చట్టం, ఒక రాజ్యాంగం అని నినదించిన మహనీయుడు అని కొనియాడారు. కేవలం రాజకీయనేతనే కాకుండా విద్యావేత్తగా, దార్షనికుడిగా జాతీయ సమగ్రత కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత కాశ్మీర్‌కు ప్రత్యేక జెండా ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దీంతో 1953లో ‘ఒక దేశంలో రెండు చట్టాలు, రెండు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదు’ అని కాశ్మీర్‌లోకి అడుగుపెట్టారన్నారు. అప్పుడే ఆయన అనుమానాస్పదంగా మరణించారన్నారు. అప్పటినుంచి జూన్ 23ను బలిదాన్ దివస్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
నేటి యువత దేశం కోసం చదవాలని, దేశం కోసం బతకాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మఠం పవన్, బెల్లాల్ శశాంక్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, బొబ్బిలి సువర్ణ వేణు, కల్పే అర్చనా చిరంజీవి, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, ప్రసన్న సత్యపాల్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, ఆనంద్ రావు, భూపతి, బాబీ సింగ్, సీనియర్ నాయకులు పవన్ ముందడ, మారావార్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Basara Temple Theft | బాసర ఆలయంలో చోరీ