Specialist Officer | బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ కొలువులు

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Specialist Officer | ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ (Indian Bank) కొలువుల భర్తీకి చర్యలు చేపట్టింది. 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.

భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 350. స్కేల్ I, II, III స్థాయిల్లో భర్తీ చేయనున్నారు.
పోస్టు పేరు : స్పెషలిస్ట్ ఆఫీసర్
భర్తీ చేసే విభాగాలు : ఐటీ, క్రెడిట్, ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ట్రెజరీ, వెల్త్ మేనేజ్‌మెంట్, హెచ్​ఆర్, మార్కెటింగ్, సెక్యూరిటీ, సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు.

Specialist Officer | విద్యార్హతలు

అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు ప్రొఫెషనల్ అర్హతలు కలిగి ఉండాలి. సీఏ, ఎంబీఏ, బీఈ, బీటెక్, ఎంసీఏ, సీఎఫ్​ఏ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి అదనపు అనుభవం అవసరం.

Specialist Officer | వయోపరిమితి

22 నుంచి 45 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు
స్కేల్ ఆధారంగా జీతాలు ఇలా ఉంటాయి..
స్కేల్ I : రూ. 48,480 – రూ. 85,920.
స్కేల్ II : రూ. 64,820 – రూ. 93,960.
స్కేల్ III : రూ. 85,920 – రూ. 1,05,280.
అదనంగా ప్రభుత్వ అలవెన్సులు కూడా లభిస్తాయి.

దరఖాస్తు గడువు : ఏప్రిల్ 28. ఫీజు చెల్లింపుతో పాటు దరఖాస్తు ఫారం సమర్పణకు కూడా అదే చివరి తేదీ.

దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 175 (కేవలం ఇంటిమేషన్ చార్జీలు)
ఇతర అభ్యర్థులకు రూ. 1,000 (ఫీజు, ఇంటిమేషన్ చార్జీలు)

ఎలా దరఖాస్తు చేయాలి?
ఐబీపీఎస్ పోర్టల్‌లోకి వెళ్లి కొత్త రిజిస్ట్రేషన్ చేయాలి. వ్యక్తిగత, విద్యార్హత, అనుభవ వివరాలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం, థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్‌రిటెన్ డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి. ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి.

ఎంపిక విధానం
ముందుగా ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్. మెడికల్ పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.

ఇది కూడా చదవండి..: TGPSC PCB Jobs | పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *