అక్షరటుడే, వెబ్డెస్క్ : Golconda Bonalu 2026 | భాగ్యనగరం (Hyderabad)లో బోనాల సంబురం మొదలు కానుంది. ఆషాఢ బోనాలు జులై 16న ప్రారంభం కానున్నాయి. గొల్కొండ మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించనున్నారు. అనంతరం నెల రోజుల పాటు నగరంలో బోనాల సందడి నెలకొననుంది. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే మహోత్సవం బోనాల పండుగ అని పొన్నం అన్నారు. ఈ ఏడాది ఆషాఢ బోనాలను మూడు కార్పొరేషన్ల పరిధిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బోనాలను విజయవంతం చేయాలని సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి బోనాల జాతర ఉత్సవాలను చూసేందుకు భక్తుల తరలివచ్చే పరిస్థితుల నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ కోరారు.
Golconda Bonalu 2026 | రూ.20 కోట్లు కేటాయింపు
ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ. 20 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సురేఖ ధన్యవాదాలు తెలిపారు. ఆషాఢ బోనాల ఉత్సవాలు జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని దేవాలయాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఘటోత్సవాలు, బోనాల సమర్పణ, సాక సమర్పణ, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల వీరంగాలు, రంగం కార్యక్రమాలు, గావుపట్టడం, సాగనంపు వంటి సంప్రదాయ కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
Golconda Bonalu 2026 | సమన్వయంతో పని చేయాలి
భక్తుల సౌకర్యార్థం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రులు సూచించారు. రద్దీ అధికంగా ఉండే ఆలయాల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలు, అదనపు బస్సులు, వైద్య బృందాలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
Golconda Bonalu 2026 | పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం
ఆగస్టు 2న సికింద్రాబాద్లో బోనాలు జరగనున్నాయి. అమ్మవారికి సీఎం రేవంత్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి పొన్నం తెలిపారు. 3న రంగం కార్యక్రమం ఉంటుంది. భక్తుల కోసం బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : Gurukul Students Benefits | గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్