CM Vijay RTC Bus Ride | ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుండి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: CM Vijay RTC Bus Ride | తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుండి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రజా రవాణాను బలోపేతం చేయడంతో పాటు, వినూత్న సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు.

CM Vijay RTC Bus Ride | బస్సుల కొనుగోలు..

రాష్ట్ర రవాణా సంస్థలను ఆధునీకరించే క్రమంలో, ప్రభుత్వం కొత్తగా 300 డీజిల్ , సీఎన్జీ (CNG) బస్సులను కొనుగోలు చేసింది. చెన్నై సచివాలయంలో సీఎం విజయ్ జెండా ఊపి వీటిని ప్రారంభించారు. దూర ప్రాంత సర్వీసుల (SETC) మినహా, మిగిలిన ఏడు రవాణా విభాగాలకు ఈ బస్సులను కేటాయించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కార్యక్రమం తర్వాత సీఎం స్వయంగా టికెట్ కొని, అన్నా స్క్వేర్ నుండి పెరంబూర్ వెళ్లే 29A నంబర్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

CM Vijay RTC Bus Ride | విజయ్ వినూత్న పథకాలు..

అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే విజయ్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మహిళలు, బాలికల రక్షణ కోసం ‘సింగప్పెన్‌ స్పెషల్ టాస్క్ ఫోర్స్’ (షీటీమ్స్) , మాదకద్రవ్యాల నిర్మూలనకు ‘యాంటీ-నార్కోటిక్ టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటు చేశారు. తన పుట్టినరోజు (జూన్ 22) సందర్భంగా ప్రజల కోసం గొప్ప పథకాన్ని ప్రకటించారు.

vijay.1 1

CM Vijay RTC Bus Ride | ఉచితంగా  బంగారం..

తమిళ సంప్రదాయం ప్రకారం, పుట్టిన బిడ్డకు మేనమామ బంగారు ఉంగరం తొడగడం ఒక పవిత్రమైన ఆచారం. ఈ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి పసిబిడ్డకు ‘మేనమామ’ తరఫున ప్రభుత్వమే ఉచితంగా ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించే పథకాన్ని సీఎం విజయ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఒక గ్రాము బంగారు ఉంగరం విలువ రూ. 13,600గా ఉంది. దీని కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 755.83 కోట్లను కేటాయిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచడం , తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడటం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సంక్షేమ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విజయ్ చూపిస్తున్న ఈ వేగం తమిళనాడు ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

ఇది కూడా చదవండి: Ayodhya Trust Probe | అయోధ్య ట్రస్ట్ వివాదం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *