Ambubachi Mela | ‘అంబుబాచి మేళా’.. తెరుచుకున్న కామాఖ్య ఆలయం

అస్సాంలోని ప్రసిద్ధ శక్తిపీఠమైన కామాఖ్య దేవాలయం శుక్రవారం ఉదయం తిరిగి తెరుచుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ambubachi Mela | అస్సాంలోని ప్రసిద్ధ శక్తిపీఠమైన కామాఖ్య దేవాలయం (Kamakhya Temple) తలుపులు నేడు ఉదయం తిరిగి తెరుచుకున్నాయి. వార్షిక ‘అంబుబాచి మేళా’ సందర్భంగా మూడు రోజులు ఆలయ గర్భగుడిని పూర్తిగా మూసేశారు. నేడు ఆలయం మళ్లీ తెరవడంతో అమ్మవారి ప్రత్యేక ప్రసాదాలైన పవిత్ర జలం (అంగోదక్), ఎర్రటి వస్త్రం కోసం భక్తులు పోటెత్తారు.

అంబుబాచి మేళా తూర్పు భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన మతపరమైన కార్యక్రమాలలో ఒకటి. ఈ ఉత్సవం జూన్ 22న ప్రారంభమైంది. జూన్ 22 రాత్రి 9:08 గంటలకు ‘ప్రవృత్తి’ (Pravritti) అనే ఆచారంతో ఈ ఉత్సవం మొదలైంది. ఇది కామాఖ్య దేవి వార్షిక ఋతుక్రమ కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ ఆచారం తర్వాత ఆలయ ద్వారాలు మూడు రోజుల పాటు మూసి ఉంచారు. ఈ సమయంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించరు. శుక్రవారం ఉదయం నిత్య పూజ పూర్తయిన తర్వాత ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకున్నారు.

Ambubachi Mela | భారీగా తరలి వచ్చిన భక్తులు

Ambubachi Mela

ఆలయం తిరిగి తెరుచుకున్నాక దర్శనం కోసం, అత్యంత పవిత్రమైనవిగా భావించే ‘అంగోదక్’ (పవిత్ర జలం) ‘అంగవస్త్ర’ (పవిత్ర వస్త్రం) స్వీకరించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గువహటిలోని నీలాచల్ కొండలపై ఉన్న కామాఖ్య ఆలయం భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటి. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

ఇది కూడా చదవండి..: Antyodaya Anna Yojana | కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ విధానంలో ఇకపై కొత్త రూల్స్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *