అక్షరటుడే వెబ్‌డెస్క్: Gachibowli Flyover Accident | ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి ( Gachibowli ) ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా రాంగ్ రూట్లో దూసుకొచ్చిన ఒక స్కూటీని, వేగంగా వస్తున్న బుల్లెట్ బైక్ బలంగా ఢీకొట్టింది.
Gachibowli Flyover Accident | ఘటన వివరాలు..
స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీకాంత్, విఠల్ అనే ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే తీవ్ర రక్తస్రావంతో మరణించారు. బుల్లెట్ బైక్ నడుపుతున్న వినోద్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Gachibowli Flyover Accident | స్థానికుల ఆగ్రహం..
గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోని ఫ్లైఓవర్లపై సమయాన్ని ఆదా చేసుకునే క్రమంలో వాహనదారులు యథేచ్ఛగా రాంగ్ రూట్లో ప్రయాణించడం నిత్యకృత్యమైందని స్థానికులు, ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇటువంటి ప్రమాదకరమైన డ్రైవింగ్‌పై దృష్టి సారించి, కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని వారు మండిపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం ఫ్లైఓవర్లపై రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్న వారిలో కనీసం భయాన్ని కలిగిస్తుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Kethireddy Dharna | కేతిరెడ్డి ధర్నా.. తాడిపత్రిలో ఉద్రిక్తత