తెలంగాణShankar Goud Death | శంకర్ గౌడ్ మరణం ప్రభుత్వ హత్యే : బండి సంజయ్​

Shankar Goud Death | శంకర్ గౌడ్ మరణం ప్రభుత్వ హత్యే : బండి సంజయ్​

ఆర్టీసీ డ్రైవర్​ శంకర్ గౌడ్ మరణం ప్రభుత్వ హత్యేనని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్​లో మీడియాతో మాట్లాడారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shankar Goud Death | శంకర్ గౌడ్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్​లో మీడియాతో మాట్లాడారు.

ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మృతిపై బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేడు తెలంగాణ (Telangana) సమాజమంతా బాధపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి, నిర్లక్ష్యం కారణంగా కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల కోసం ఎవరైనా ఆందోళన చేస్తే.. ప్రభుత్వం చర్చించాల్సింది పోయి బెదిరించడం సరికాదన్నారు. సమ్మెతో 10 వేల బస్సులు ఆగిపోయాన్నారు. ఇంత పెద్ద సమ్మె జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

Shankar Goud Death | హామీలు అమలు చేయాలి

ఆర్టీసీ కార్మికులకు రిటైర్మెంట్​ తర్వాత ఆసరా పింఛన్​ కంటే తక్కువ పెన్షన్​ వస్తుందన్నారు. బీఆర్​ఎస్​ (BRS) హయాంలో సైతం కార్మికులు 52 రోజులు సమ్మె చేస్తే వేధింపులకు గురి చేశారన్నారు. నేడు కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా అదే మార్గంలో ప్రయాణిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు (RTC Workers) ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

Shankar Goud Death | కుటుంబాలను అన్యాయం చేయొద్దు

కార్మికులు తమ కుటుంబాలను అన్యాయం చేయవద్దని బండి సంజయ్​ కోరారు. బలిదానాలు చేసుకోవద్దని సూచించారు. ఉండి కొట్లాడి ప్రభుత్వం మెడలు వంచుదామన్నారు. కార్మికులకు అండగా బీజేపీ (BJP) ఉంటుందన్నారు. కాంగ్రెస్​ కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి మూటలు పంపుతున్న కాంగ్రెస్​కు కార్మికులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి..: Pawan Khera | కాంగ్రెస్​ నేత పవన్​ ఖేరాకు హైకోర్టులో చుక్కెదురు.. బెయిల్​ పిటిషన్​ కొట్టివేత

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....