జాబ్స్​ & ఎడ్యుకేషన్​SBI Jobs | రాతపరీక్ష లేకుండా ఎస్‌బీఐలో ఉద్యోగావకాశాలు!

SBI Jobs | రాతపరీక్ష లేకుండా ఎస్‌బీఐలో ఉద్యోగావకాశాలు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. కాంట్రాక్ట్ పద్ధతిన పలు పోస్టులను భర్తీ చేయనుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: SBI Jobs | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇది నిరుద్యోగ యువత కోసం కాదు.. బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న రిటైర్డ్ అధికారులకు మళ్లీ పని చేసే అవకాశం కల్పించనుంది. 105 రిజాల్వర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనుంది. ఎంపికైన వారు కస్టమర్ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించే బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందామా..

మొత్తం ఖాళీలు : 105.

ప్రధాన నగరాలవారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో 5.
అమరావతిలో 3.
గాంధీనగర్‌లో 6.
బెంగళూరులో 5.
భోపాల్‌లో 9.
భువనేశ్వర్‌లో 2.
చండీగఢ్‌లో 2.
చెన్నైలో 5.
న్యూఢిల్లీలో 15.
జైపూర్‌లో 6.
కోల్‌కతాలో 7.
లక్నోలో 13.
మహారాష్ట్రలో 4.
ముంబై మెట్రోలో 5.
గౌహతిలో 6.
పాట్నాలో 10.
తిరువనంతపురంలో 2.

SBI Jobs | అర్హతలు :

రిటైర్డ్ ఎస్‌బీఐ అధికారులు మాత్రమే అర్హులు.
ఎమఎమ్‌జీఎస్-II, ఎమఎమ్‌జీఎస్-III, ఎసఎమ్‌జీఎస్-IV గ్రేడ్‌లలో రిటైర్ అయి ఉండాలి. బ్యాంకింగ్ విధానాలు, సిస్టమ్స్‌పై అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నవారు, డిసిప్లినరీ సమస్యలు ఉన్నవారు అనర్హులు.

SBI Jobs | వయో పరిమితి :

ఈ ఏడాది మార్చి 31 నాటికి 63 ఏళ్లు దాటని వారు అర్హులు. గరిష్టంగా 65 ఏళ్ల వరకు పని చేసే అవకాశం ఉంటుంది.

వేతనం :
ఎమఎమ్‌జీఎస్-II, ఎమఎమ్‌జీఎస్-III వారికి నెలకు రూ. 45 వేలు, ఎసఎమ్‌జీఎస్-IV వారికి నెలకు రూ.50 వేలు ఇస్తారు. పీఎఫ్, గ్రాట్యుటీ, ఇతర అలవెన్సులు ఉండవు.

దరఖాస్తు గడువు : మే 5.

ఎంపిక ప్రక్రియ : అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. తర్వాత 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ తర్వాత తెలియజేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

పూర్తి వివరాలకు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ను సంప్రదించండి.

ఇది కూడా చదవండి..: Specialist Officer | బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ కొలువులు

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

DJ Sound | డీజే శబ్దం భరించలేక 140 కోళ్లు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన

అక్షరటుడే, వెబ్​డెస్క్: DJ Sound | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని...

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...