అక్షరటుడే వెబ్‌డెస్క్: Russia Sanctions Bill | రష్యా ఆర్థిక వ్యవస్థను, ఇంధన ప్రాజెక్టులను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కాంగ్రెస్ ( US Congress )ఒక ప్రత్యేక బిల్లును రూపొందిస్తోంది. ఇందులో భాగంగా, గతంలో ప్రతిపాదించిన 500 శాతం సుంకాల పరిమితిని ఏకంగా 100 శాతానికి తగ్గిస్తూ బిల్లులో కీలక మార్పులు చేశారు. రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, స్లోవేకియా, హంగరీ, అజర్‌బైజాన్ వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆంక్షలను సిద్ధం చేస్తున్నారు. ఈ సవరించిన బిల్లుకు అమెరికాలోని అధికార డెమొక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్ల నుంచి పూర్తి మద్దతు లభించడం విశేషం.
Russia Sanctions Bill | భారత్ సహా ఇతర దేశాలపై ప్రభావం..
రష్యా నుంచి రాయితీ ధరలకు ముడిచమురును పొందుతూ తమ దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకుంటున్న భారత్ వంటి దేశాలపై ఈ 100 శాతం సుంకాల ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవేళ ఈ నిబంధన అమల్లోకి వస్తే, ఈ దేశాలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిణామం అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో ఎలాంటి మలుపులకు దారితీస్తుందనేది ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇది కూడా చదవండి: US Iran Attacks | ఇరాన్‌పై అమెరికా దాడులు