అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CJP Parliament Protest | కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ (Delhi)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీజేపీ ఆధ్వర్యంలో సోమవారం పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు.
జంతర్‌మంతర్ వద్ద గుమిగూడిన వారిని అదుపు చేయడానికి పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జూలై 20న CJP తలపెట్టిన ర్యాలీకి ఎటువంటి అనుమతి లభించలేదు. దీంతో భారీ సంఖ్యలో ఉన్న నిరసనకారులకు, వారిని అడ్డుకునేందుకు భారీగా మోహరించిన భద్రతా బలగాలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. రాజధానిలో అల్లర్లను అదుపు చేసే భద్రతా సిబ్బందిని మోహరించారు.
CJP Parliament Protest | సోనమ్ వాంగ్‌చుక్ భార్య ఆధ్వర్యంలో..
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయనను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. అయినా కూడా సోనమ్ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నారు. మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించడంపై దృష్టి పెడతామని ఆమె తెలిపారు. పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ కోరారు.
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద, CJP నిరసన ర్యాలీ కోసం సమావేశమైన ఆందోళనకారులకు మరియు RPF సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఆందోళనకారులను అదుపు చేయడానికి RPF సిబ్బంది, పోలీసులు లాఠీలను ఉపయోగించినట్లు సమాచారం.
(Source : ANI)#Delhi #JantarMantar #Protest #Police… pic.twitter.com/4EhYhddg7E
— Akshara Today | Telugu News (@aksharatoday) July 20, 2026
ఇది కూడా చదవండి..: Unemployment Safety Net | ఉద్యోగి రక్షణలో భారత్ వెనుకబడి ఉంది : కేంద్రంపై కవిత విమర్శలు!