Sonam Wangchuk | ఆ హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్​చుక్​ లేఖ

విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోమని హామీ ఇస్తే తాను దీక్ష విరమిస్తానని సోనమ్​ వాంగ్​చుక్​ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sonam Wangchuk | నీట్ (NEET) పేపర్​ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్​చుక్​ కేంద్రానికి లేఖ రాశారు. విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని కోరారు. అలా హామీ ఇస్తే తాను దీక్ష విరమిస్తానని పేర్కొన్నారు.

నీట్ పేపర్ లీక్‌పై జవాబుదారీతనం కోరుతూ నిరసన తెలుపుతున్న యువతపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇస్తే నిరాహార దీక్షను విరమిస్తానని సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. అటువంటి హామీ లభించకపోతే, తన నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తానన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా (JP Nadda), జితేంద్ర సింగ్‌లకు లేఖ రాశారు. నిష్పక్షపాతమైన, జవాబుదారీతనం గల విద్యా వ్యవస్థ కోసమే నిరసనకారులు తమ గళం విప్పుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Sonam Wangchuk | ఆస్పత్రిలో కొనసాగుతున్న దీక్ష

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా సీజేపీ (CJP) చేపట్టిన నిరసనలో భాగంగా సోనమ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 20 రోజుల దీక్ష తర్వాత ఆయనను శనివారం జంతర్ మంతర్ నిరసన స్థలం నుంచి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో కూడా వాంగ్​చుక్ దీక్ష కొనసాగిస్తున్నారు. సుమారు 65 మంది పార్లమెంటు సభ్యులు తన దీక్షను విరమించాలని కోరారని ఆయన తెలిపారు. తాను కూడా విద్యా రంగానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. అయితే ఉద్యమానికి కేంద్రంగా ఉన్న యువతను పణంగా పెట్టి వెళ్లాలేనని తెలిపారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దీనిని కూడా చదవండి : Passport Fee Hike | పాస్‌పోర్ట్ ఫీజు పెంపుపై హైకోర్టు జోక్యం.. విదేశాంగ శాఖకు కీలక ఆదేశాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *