Seasonal Diseases | సీజనల్​ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమ్మర్​పల్లి హెల్త్​ సూపర్​వైజర్​ ఆకుల మారుతి సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Seasonal Diseases | వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమ్మర్​పల్లి (Kammarpalli) హెల్త్​ సూపర్​వైజర్​ ఆకుల మారుతి పేర్కొన్నారు. ధర్మోరా జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్​ మాత్రలను అందజేశారు.

Seasonal Diseases | వర్షాకాలంలో వచ్చే వ్యాధులు

వర్షాకాలంలో వచ్చే వ్యాధులు వాటి నివారణపై హెల్త్​ సూపర్​వైజర్​ విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మాత్రలను పంపిణీ చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిశుభ్రత, శానిటేషన్​పై వివరించారు. అనంతరం సీజనల్​ వ్యాధులపై క్విజ్​ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పాఠశాల, వంటశాల, మరుగుదొడ్లను పరిశీలించి వాటి పరిశుభ్రతపై తగు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్​హెచ్​పీ లావణ్య, ఏఎన్​ఎం దీప, ఆశావర్కర్​ పద్మ, హెచ్​ఎం రఘునందనాచారి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Land Registrations | తహశీల్దార్​పై వేటు సరే.. ఆ ఆపరేటర్​పై చర్యలేవి..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *