NEET Protests| నిరసనలకు దూరంగా ఉండాలంటూ హెచ్చరికలు.. యూనివర్సిటీలపై రాహుల్ గాంధీ ఫైర్

నీట్‌ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు దూరంగా ఉండాలని పలు యూనివర్సిటీలు విద్యార్థులను హెచ్చరించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: NEET Protests | నీట్‌ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు దూరంగా ఉండాలని పలు యూనివర్సిటీలు విద్యార్థులను హెచ్చరించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించేందుకు విద్యార్థులు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్నారని, వారిని నిరసనల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించడానికి మీకెంత ధైర్యమని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఆయా విశ్వవిద్యాలయాలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

NEET Protests | యూనివర్సిటీల సర్క్యులర్లు..

జంతర్‌మంతర్‌ వద్ద జరిగే నిరసనలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లొద్దని దిల్లీ యూనివర్సిటీ (DU), జేఎన్‌యూ (JNU), ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్ సహా పలు విద్యాసంస్థలు తమ విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేశాయి. సోషల్ మీడియాలోనూ నిరసనలకు సంబంధించిన పోస్టులు పెట్టవద్దని సూచించాయి.

NEET Protests | ప్రముఖుల స్పందన..

దేశంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించేందుకు విద్యార్థులు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్నారని, వారి గొంతును నొక్కేసే ప్రయత్నాలను ఖండించారు. ఇదే అంశంపై దిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఎంపీ దీపేందర్ హుడా స్పందిస్తూ.. జంతర్‌మంతర్‌ వద్ద ప్రదర్శనలు చట్టవిరుద్ధమని ఎవరు చెప్పారంటూ డీయూ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే నటి, నిర్మాత పూజా భట్ మాట్లాడుతూ, విద్యార్థుల గొంతులను అణచివేయడం వల్ల వారి భద్రత మరింత ప్రమాదంలో పడుతుందని, అందరూ వారి ప్రజాస్వామ్య హక్కులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: KTR NEET Protest | మోదీ జాగ్రత్తగా ఉండు.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *