July 26 Horoscope | గతంలో పెట్టిన పెట్టుబడులతో భారీ లాభాలు..ఈ రాశుల వారి దశ తిరిగినట్టే!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: July 26 Horoscope | గ్రహాల గమనం వల్ల ఇవాళ (ఆదివారం, జులై 26) కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలు కలగబోతున్నాయి.

ముఖ్యంగా కొందరికి తమ పిల్లల సాధనలు, విజయాల వల్ల కుటుంబంలో సరికొత్త ఆనందం నిండటమే కాకుండా, సమాజంలో తల్లిదండ్రులుగా అరుదైన గౌరవ సత్కారాలు లభిస్తాయి.

మరికొందరికి ఆప్తమిత్రుల సాయంతో ఊహించని ధనలాభాలు అందుతాయి, అలాగే వ్యాపారవేత్తలకు దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.

July 26 Horoscope | రాశుల వారిగా..

మేష రాశి: July 26 Horoscope | ఓర్పు, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఇవాళ విజయం మీసొంతం అవుతుంది. ఆకర్షణీయంగా కనిపించే పథకాల్లో తొందరపడి పెట్టుబడి పెట్టకండి.

నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. అనవసరమైన గొడవలు, వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

వృషభ రాశి: July 26 Horoscope | చిన్నపాటి వ్యాయామంతో మీ రోజును ప్రారంభించండి. ఆర్థికంగా అంతగా కలసివచ్చే రోజు కాదు. కాబట్టి అవసరమైన వాటికే ఖర్చు చేస్తూ పరిమితి పాటించడం మంచిది.

ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. స్నేహితుడు ఒకరు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే (సర్ ప్రైజ్) తీపి కబురు లేదా బహుమతి ఇస్తారు.

మిథున రాశి: July 26 Horoscope | ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం లభిస్తుంది. పెట్టుబడులు, భవిష్యత్తు ప్రణాళికల (Goals) గురించిన వివరాలను ఎవరితోనూ పంచుకోకుండా రహస్యంగా ఉంచడం మంచిది.

ఆఫీసులో, పని ప్రదేశంలో మీ ఉత్సాహవంతమైన శైలి సహుద్యోగులను ఆకట్టుకుంటుంది. దేవాలయం, ఆధ్యాత్మిక ప్రదేశాన్ని దర్శించుకుంటారు.

కర్కాటక రాశి: July 26 Horoscope | ఇవాళ మీకు డబ్బు ప్రాముఖ్యత తెలుస్తుంది. అనవసర ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్తుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుందో గ్రహిస్తారు. మీ భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రావచ్చు. పనుల్లో అనుకున్నంత సహాయం అందకపోవడం వల్ల కాస్త ఒత్తిడి పెరుగుతుంది.

సింహ రాశి: July 26 Horoscope | మీలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటాయి. తమ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించాలనుకునే వారికి ఇవాళ ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది.

బంధువులు మీకు అవసరమైన సహాయం చేయడానికి ముందుకు వస్తారు. దాంపత్య జీవితంలో ఎదురైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.

Basinga Balaalu Song | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘బాసింగ బలాలూ’.. నెల రోజుల్లో 47 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డుల ధమాకా!

కన్యా రాశి: July 26 Horoscope | మీ తోబుట్టువులలో ఒకరు మీ వద్ద అప్పుగా డబ్బు తీసుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడే అవకాశం ఉంది. స్నేహితులు మీకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తారు. గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతుంటే, అవన్నీ తొలగిపోయి చాలా ఆనందంగా గడుస్తుంది.

తులా రాశి: July 26 Horoscope | మీ భాగస్వామి ఆరోగ్యం కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే, మీరు గతంలో దాచుకున్న డబ్బు ఇవాళ చేతికి అందడం వల్ల పెద్దగా దిగులు చెందాల్సిన అవసరం ఉండదు. ఒక తియ్యని సందేశం (Message) మీ రోజంతటినీ ఆనందంగా మారుస్తుంది.

వృశ్చిక రాశి: July 26 Horoscope | గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది.

అయితే ప్రేమ విషయాల్లో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం మంచిది. ఏ నిర్ణయమైనా ఆఖరిగా ఓకే చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోండి. సొంతంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు.

ధనుస్సు రాశి: రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే, ముందుగానే వేసుకున్న బడ్జెట్‌కు కట్టుబడి ఉండటం శ్రేయస్కరం. కుటుంబ సభ్యులతో కలిసి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. అయితే ఈ సంభాషణలు కొందరిని కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ, సమస్యలకు ఎలాంటి పరిష్కారం దొరక్కపోవచ్చు.

మకర రాశి: శరీర దృఢత్వం, ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనడం వల్ల కొంత ఆర్థిక ఇబ్బంది ఎదురవ్వచ్చు.

అయితే, ఈ కొనుగోలు భవిష్యత్తులో మిమ్మల్ని అనేక పెద్ద సమస్యల నుండి కాపాడుతుంది. విదేశాలలో ఉన్నవారి నుండి ఒక బాధాకరమైన వార్త వినే సూచనలు ఉన్నాయి.

ఆర్థిక పరిస్థితి బాగుండటానికి ప్రతిరోజు సూర్యోదయ సమయంలో “ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః” లేదా “ఓం ఘృణిః సూర్యాయ నమః” అనే మంత్రాన్ని జపించండి.

కుంభ రాశి: ప్రయాణాలు చేయడం వల్ల ఒత్తిడి అనిపించినప్పటికీ, ఆర్థికంగా మాత్రం మంచి లాభదాయకంగా ఉంటుంది. బంధువులు, స్నేహితుల నుండి అనుకోని కానుకలు, బహుమతులు అందుతాయి.

కష్ట సమయంలో ఒక ఆప్తమిత్రుడు లేదా ప్రత్యేకమైన స్నేహితుడు మీకు కొండంత అండగా నిలుస్తారు. అత్తమామల వైపు నుండి ఒక విచారకరమైన వార్త వినే అవకాశం ఉంది.

మీన రాశి: పిల్లల ప్రతిభ, సాధనలు మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. సొంతంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు. కుటుంబ ప్రయోజనాల కోసం అందరితో కలిసిపోవడం మంచిది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *