అక్షరటుడే వెబ్డెస్క్: Black Sea Travel Advisory | నల్లసముద్రం (Black Sea) , దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ పౌరులకు కీలకమైన ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఆ ప్రాంతంలో ప్రయాణించే పౌరులు, పనిచేస్తున్న కమర్షియల్ వెసెల్స్ (వ్యాపార నౌకలు) అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
Black Sea Travel Advisory | నౌకలపై పెరుగుతున్న దాడులు..
ప్రస్తుతం నల్లసముద్రంలో సరుకు రవాణా చేసే నౌకలపై క్షిపణులు, డ్రోన్ల దాడులు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా గత ఏప్రిల్ నుంచి ఈ దాడుల తీవ్రత మరింత ఎక్కువైంది. ఈ దురదృష్టకర సంఘటనల్లో ఇప్పటివరకు ఐదుగురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
Black Sea Travel Advisory | విదేశాంగ శాఖ సూచనలు..
భారత ( India )పౌరులకు జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీలో భాగంగా, బ్లాక్ సీ ప్రాంతంలోని నౌకల్లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయ నావికులు అక్కడ ఉండే ప్రమాదాలను ముందుగానే క్షుణ్ణంగా అంచనా వేసుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది. ఉద్యోగంలో చేరేముందు భద్రతా ఏర్పాట్లు, ఇన్సూరెన్స్ పరిహారం, అత్యవసర సమయాల్లో అనుసరించాల్సిన విధానాలు, నిబంధనలను తప్పకుండా పరిశీలించుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొనసాగుతున్న భారతీయులు తమ కుటుంబ సభ్యులతో ఎల్లప్పుడూ టచ్లో ఉండాలని కోరింది. అలాగే, నౌకల యాజమాన్యం అందించే భద్రతా మార్గదర్శకాలను పాటించడంతో పాటు, విదేశాంగ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Jurala Project Inflow | జూరాలకు ప్రారంభమైన వరద..