Heavy Rain Alert | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Alert | తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంగారెడ్డి, వికారాబాద్​, రంగారెడ్ఇ, మెదక్​, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సిద్దిపేట జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్​ నగరంలో సాయంత్రం వేళ మోస్తరు వర్షం పడుతుంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు కురిసే ఛాన్స్​ ఉంది.

Heavy Rain Alert | జలాశయాలకు కొనసాగుతున్న వరద

ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో జూన్​లో లోటు వర్షపాతం నమోదు అయింది. జులై 20 వరకు వానలు జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అయితే జులై చివరలో వాయుగుండం రూపంలో వరుణుడు కరుణించాడు. భారీ వర్షాలు పడ్డాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు ఢోకా లేదని పేర్కొంటున్నారు. మరోవైపు ఇటీవల కురుస్తున్న వర్షాలతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. స్థానికంగా కురుస్తున్న వానలతో పాటు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ప్రధాన జలాశయాలకు ఇన్​ఫ్లో కొనసాగుతోంది. గోదావరిపై గల ఎస్సారెస్పీకి వరద వస్తోంది. ఎల్లంపల్లి ఇప్పటికే నిండుకుండలా మారింది. మరోవైపు జూరాల నిండగా.. శ్రీశైలానికి భారీ వరద కొనసాగుతోంది. నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లో సైతం ఆశాజనకంగా నీటిమట్టం ఉంది.

ఇది కూడా చదవండి..: Revanth Reddy Sergio Gor | తెలంగాణ విద్యార్థుల కోసం అమెరికా వీసాలు పెంచాలి : యూఎస్​ రాయబారితో సీఎం రేవంత్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *