అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tata Sons Chairman | టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవి నుంచి వైదొలిగారు. తాను పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. మరో విడత కోసం తిరిగి నియామకాన్ని కోరబోనని ప్రకటించారు. చంద్రశేఖరన్ టాటా స్టీల్, టాటా మోటార్స్, TCS, ఇండియన్ హోటల్స్‌తో సహా అనేక టాటా గ్రూప్ కంపెనీలకు ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
Tata Sons Chairman | వారసుడి ఎంపికపై నిర్ణయం తీసుకోండి..
బాధ్యతల బదిలీ సజావుగా సాగేలా చూసేందుకు, తన వారసుడి ఎంపికపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని బోర్డును కోరినట్లు చంద్రశేఖరన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన ప్రస్తుత పదవీకాలం ఫిబ్రవరి 2027 వరకు ఉంది. ఆగస్టు 18న జరగనున్న కంపెనీ వార్షిక సాధారణ సమావేశానికి ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Tata Sons Chairman | టాటా గ్రూప్‌లో 40 ఏళ్ల ప్రస్థానం..
టాటా గ్రూప్ (Tata Group)లో తన వృత్తిపరమైన ప్రయాణంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నానని, ఈ ప్రతిష్టాత్మక సంస్థకు తనవంతు సహకారం అందించే అవకాశం లభించడం ఎంతో సంతృప్తినిచ్చిందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. “గత దశాబ్ద కాలంగా టాటా సన్స్‌కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవం, అత్యంత కీలకమైన బాధ్యత,” అని అన్నారు. “ఫిబ్రవరి 20, 2027న నా పదవీకాలం ముగిసినప్పుడు తిరిగి నియామకానికి సిద్ధంగా లేనని టాటా సన్స్ బోర్డుకు ఈ రోజు తెలియజేశాను,” అని ఆయన చెప్పారు. కాగా.. తాజా పరిణామాల మధ్య, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు 5 శాతం మేర పడిపోయాయి.
ఇది కూడా చదవండి: Aug 12 Gold Prices | మల్టీ-వీక్ గరిష్ఠాలకు సమీపంలో బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ ధర ఎంతంటే..