Amit Shah Resignation | అమిత్ షా రాజీనామా చేయాలి.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amit Shah Resignation | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇదే క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలపై జరిగిన లాఠీచార్జ్ వ్యవహారంపై పార్లమెంటులో సుదీర్ఘ చర్చకు సిద్ధమని అమిత్ షా ప్రకటించగా.. దీనిపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు.

Amit Shah Resignation | అమిత్ షాకు ధైర్యం లేదు..

యువతకు అమిత్ షా చేసే ఉపన్యాసాలపై ఎలాంటి ఆసక్తి లేదని, ఆయనలో ధైర్యం కొరవడిందని రాహుల్ గాంధీ విమర్శించారు. గత 20 రోజులుగా అమిత్ షా సభలో కనిపించడం లేదని, ధైర్యం లేకనే ఆయన రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని విద్యార్థులపై కాల్పులు జరిపింది ఎవరని ప్రశ్నించిన ఆయన.. మేకులు ఉన్న లాఠీలతో విద్యార్థులను కొట్టమని ఎవరు ఆదేశాలు ఇచ్చారంటూ నిలదీశారు. ఒకవేళ పిల్లలపై కాల్పులు జరపాలని అమిత్ షానే ఆదేశించి ఉంటే, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Jantar Mantar Attack | జంతర్ మంతర్ విద్యార్థుల దాడులపై చర్చకు సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *