అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indus Water Treaty | భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల ఒప్పందం (Indus Water Treaty)పై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. సింధు నదీ జలాలపై శుక్రవారం పాక్ ప్రధాని వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఈ విధంగా స్పందించారు.
రణధీర్ జైస్వాల్ శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. గత కొద్ది నెలలుగా అఫ్ఘనిస్తాన్ (Afganisthan)తో అనేక చర్చలు, సమావేశాలు జరిగాయన్నారు. అఫ్ఘనిస్తాన్ ప్రతినిధులు భారత్‌ను పలుమార్లు సందర్శించారన్నారు. దీంతో అభివృద్ధి, సహకారం, వాణిజ్యం, అనుసంధానత వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం బలపడిందన్నారు. ఆ దేశంతో భారత్‌కు దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వాటిని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
Indus Water Treaty | కొలంబియాకు సాయం
కొలంబియాలో ఇటీవల భూకంపం సంభవించి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సానుభూతి తెలిపారు. ఆ దేశానికి సాయం చేస్తామన్నారు. ఈ రోజు 20 మెట్రిక్ టన్నుల సహాయక సామగ్రిని పంపించామన్నారు. ఇందులో వైద్య సామగ్రి, వైద్య పరికరాలు, భూకంపం తర్వాత పునరుద్ధరణకు ఉపయోగపడే ఇతర వస్తువులు ఉన్నాయని వెల్లడించారు. నార్వే విదేశాంగ మంత్రి ఎస్పెన్ బార్త్ ఐడే చేసిన వ్యాఖ్యలపై రణధీర్ జైస్వాల్ స్పందించారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగం అని స్పష్టం చేవారు. అవి ఎప్పటికీ వేరు చేయలేనివని పేర్కొన్నారు. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతున్న అకృత్యాలు, సరిహద్దు ఉగ్రవాదం కోసం ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్ వినియోగించుకోవడం గురించి అంతర్జాతీయ సమాజం స్పందించాలన్నారు.
#WATCH | Delhi | On Norwegian Foreign Minister Espen Barth Eide’s remarks, MEA Spokesperson Randhir Jaiswal says, “…The whole of Jammu, Kashmir, and Ladakh is an integral and inalienable part of India. The issues that should concern the international community are the… pic.twitter.com/jgvlaGPRgG
— ANI (@ANI) August 14, 2026
దీనిని కూడా చదవండి : Telangana Cabinet | ఆటో డ్రైవర్ల కోసం కొత్త స్కీం… తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు