Padkal Theft Case | పడకల్‌లో దొంగల బీభత్సం.. నగదు అపహరణ

జక్రాన్​పల్లి మండలంలోని పడకల్​లో దొంగలు బీభత్సం సృష్టించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్​: Padkal Theft Case | జక్రాన్​పల్లి మండలంలోని పడకల్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా ఉన్న దుకాణాన్ని దోచుకున్నారు. మరో ఇంట్లో హంగామా చేశారు.

Padkal Theft Case | జక్రాన్​పల్లి మండలం పడకల్​లో..

జక్రాన్​పల్లి పోలీసులు (Jakranpalli Police) తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో అర్ధరాత్రి ఓ దుకాణంతో పాటు మరో ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీకి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్టోర్ తాళాలు పగలగొట్టి, రూ.3 లక్షల నగదును అపహరించుకెళ్లారు. మొదట గ్రామంలోని ఒక ఇంట్లోకి చొరబడ్డారు. అయితే అక్కడ వారికి విలువైన వస్తువులేవీ లభించకపోవడంతో ఖాళీ చేతులతో వెనుతిరిగారు. ఆ తర్వాత సమీపంలోని ‘శ్రీ లక్ష్మీ నరసింహ స్టోర్’ షట్టర్ తాళాలను విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. షాప్​లోని క్యాష్ కౌంటర్‌లో దాచి ఉంచిన రూ.3 లక్షల నగదును దోచుకున్నారు. ఉదయాన్నే షాపు తెరిచేందుకు వచ్చిన యజమాని తాళాలు విరిగి ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందారు.

వెంటనే జక్రాన్​పల్లి పోలీసులకు సమాచారం అందించగా వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. సీసీ టీవీ (CCTV) కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. గ్రామంలో వరుస చోరీల యత్నాలతో తీవ్ర భయాందోళన చెందుతున్న ప్రజలు, రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్‌ను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: NSUI Leaders Suspension | ఎన్​ఎస్​యూఐ యువ నాయకులపై సస్పెన్షన్​ రద్దు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *