అక్షరటుడే, వెబ్‌డెస్క్: University of London | హైదరాబాద్ Hyderabad లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ (UoL) కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ విద్యా సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని సెనేట్ హౌస్‌లో ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ అధికారులు కె రామకృష్ణారావు, జయేశ్ రంజన్ పాల్గొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో వారు సుదీర్ఘంగా చర్చించారు.
University of London | పలు బ్రాంచుల ప్రతినిధులు..
ఈ భేటీలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE), స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)కు చెందిన ప్రతినిధి బృందాలు, ఇతర ప్రతినిధులు కూడా ఉన్నారు.
హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ (UoL) కృషి చేస్తోందని ఆ విద్యా సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా వెల్లడించారు.
Konda Sushmitha | తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా కల్లోలం.. సుష్మిత తిరుగుబాటు వెనుక అసలు కథేంటి?
University of London | విస్తృత కోర్సులు..
యూనివర్సిటీకి చెందిన వివిధ స్కూళ్లు, విభాగాల ద్వారా విస్తృత స్థాయిలో విద్యా కోర్సులు, వివిధ విద్యా కార్యక్రమాలను అందించేలా ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వివరించారు.
యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన వివిధ విద్యా విభాగాలను ఒకే అకడమిక్ ఫెడరేషన్‌గా అనుసంధానించే విధంగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.