22A Land Issue | 22-ఏ భూముల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా..? కాంగ్రెస్​కు బీజేపీ సవాల్​

22-ఏ భూముల అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ప్రకటించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: 22A Land Issue |  22-ఏ భూముల అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందూరులో ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తానని దినేష్ పటేల్ కులాచారి ప్రకటించారు. బీజేపీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

22A Land Issue | విషయ పరిజ్ఞానం ఉంటే రావాలి..

ఈ అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చర్చకు రావచ్చని దినేష్​ కులాచారి పేర్కొన్నారు. తాను అన్ని విషయాలను ఆధారాలతో సహా వివరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు ఈ అంశంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఒకవేళ చర్చకు రాకపోతే, 22-ఏ భూముల సమస్యపై రాష్ట్ర పార్టీ సూచన మేరకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తామని తెలిపారు.

22A Land Issue | వినతిపత్రం ఇద్దామని వస్తే..

పేద ప్రజలకు 22-ఏ భూముల వల్ల జరుగుతున్న నష్టాన్ని, వారి సమస్యలపై కలెక్టర్​కు వినతిపత్రం ఇవ్వాలని వస్తే బీజేపీ నాయకులపై అనుచితంగా ప్రవర్తించారని దీనిని ఖండిస్తున్నామని దినేష్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న హక్కు అని, అలాంటి సమయంలో పోలీసుల ప్రవర్తన సముచితం కాదన్నారు.

22A Land Issue | కాంగ్రెస్​ నాయకులు గూండాల్లా..

కాంగ్రెస్ నాయకులు గుండాల్లా వ్యవహరించడం మానుకోవాలని, వీడియోలు విడుదల చేసి తప్పుపట్టడం కాకుండా ప్రజల సమస్యలపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ జిల్లాధ్యక్షుడు అన్నారు. 22-ఏ భూముల విషయంలో పేదలకు జరుగుతున్న నష్టాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే బీజేపీ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, డిప్యుటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీ నారాయణ, కార్పొరేటర్లు యాదల నరేష్, బెల్లల్ శశాంక్, జగదీష్ కులకర్ణి, ఎస్​టీ మోర్చా అధ్యక్షుడు ఓం సింగ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మారెడ్డి వనిత, యువమోర్చా అధ్యక్షుడు వంశీ గౌడ్, యువ మోర్చా రాష్ట్ర కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు ఎస్​ఆర్​ సత్యపాల్, నాయిడి రాజన్న, మండల అధ్యక్షుడు ఆనంద్ రావు, జగన్ రెడ్డి, ఆనంద్, రాకేష్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: Jaishankar Bangladesh Relations | ‘పొరుగు దేశాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాయని ఆశించలేం…’ : జైశంకర్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *