అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Navadurga Temple | జిల్లావ్యాప్తంగా (Nizamabad) ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత కలెక్టరేట్లోని నవదుర్గా ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
Navadurga Temple | టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో..
ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి ఈశ్వరి, సుమన్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజు, కోశాధికారి నిరంజన్ గౌడ్, ఉపాధ్యక్షులు సంజీవయ్య, జాఫర్ హుస్సేన్, పద్మ ,అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్, గురుచరణ్, స్వామి, విజయలక్ష్మి, మంగమ్మ, గీతారెడ్డి, శరణ్య టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్ గారు వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.