Amrit Bharat Express | తెలంగాణ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

తెలంగాణ రైల్వే ప్రయాణికులకు ఇది గుడ్ న్యూస్. మరో కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్​ అందుబాటులోకి వచ్చింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amrit Bharat Express | తెలంగాణ రైల్వే ప్రయాణికులకు ఇది గుడ్ న్యూస్. మరో కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్​ అందుబాటులోకి వచ్చింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరు వరకు 22363/22364 అమృత్ భారత్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును రైల్వే శాఖ ప్రారంభించింది.

Amrit Bharat Express | ధన్​బాద్​ టు కోయంబత్తూర్​

ఈ రైలు బీహార్‌లోని గయా మీదుగా నడుస్తుంది. తిరుపతికి సమీపంలోని రేణిగుంట జంక్షన్ మీదుగా కోయంబత్తూరు చేరుకుంటుంది. దీంతో ఉత్తర భారత్​ నుంచి తిరుపతి ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులకు మరో కొత్త కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది.

Amrit Bharat Express | తెలంగాణలో పలు స్టేషన్ల మీదుగా..

ఈ అమృత్​ భారత్​ రైలుకు తెలంగాణలోని సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో స్టాప్‌లు కల్పించారు. ఈ రైలు ధన్‌బాద్ నుంచి ప్రతి శనివారం సాయంత్రం 4:10 గంటలకు బయలుదేరి సోమవారం కోయంబత్తూరు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కోయంబత్తూరు నుంచి ప్రతి మంగళవారం ఉదయం 7:50 గంటలకు బయలుదేరుతుంది. రెగ్యులర్ సర్వీస్ ధన్‌బాద్ నుంచి ఆగస్టు 22న ప్రారంభమైంది.

ఇది కూడా చదవండి..: Sumanth Driver Arrest | మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *