Minister Rajanarsimha | వైద్య, ఆరోగ్య సేవల బలోపేతానికి కృషి : మంత్రి రాజనర్సింహ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Rajanarsimha | మెదక్ (Medak)​ జిల్లాలో వైద్యారోగ్య సేవలను బలోపేతం చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్​ను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​ (MLA Rohith)తో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు.

క్రిటికల్ కేర్ బ్లాక్​ను త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్ల పై GGH ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సునీత దేవి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా నితిన్ కబ్రా, DMHO డా. జ్ఞానేశ్వర్, DCHS డా. శివ దయాళ్, వైద్య ఆరోగ్యశాఖ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన HR ఎక్విప్మెంట్, వసతులు, IHFMS సేవలను అందుబాటులోకి తేవడంపై హైదరాబాద్ సచివాలయంలో మంగళవారం నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశానికి రావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. GGHలో వైద్య సేవల బలోపేతంపై మంత్రి చర్చించారు.

Minister Rajanarsimha | కొత్త భవనాలు నిర్మిస్తాం

జీజీహెచ్​ నూతన భవనం, మెడికల్ కాలేజీ విద్యార్థులకు హాస్టల్ నిర్మాణంపై మంత్రి చర్చించారు. తూప్రాన్​లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో నర్సాపూర్, రామాయంపేట, కౌడిపల్లి, తూప్రాన్లలో కిడ్నీ రోగులకు అందిస్తున్న డయాలసిస్ సేవలపై చర్చించారు. మెదక్ జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవల బలోపేతానికి అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి : ACB Raid | రూ.లక్ష లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన ట్యాక్స్​ ఆఫీసర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *