అక్షరటుడే, వెబ్‌డెస్క్: Balaji Sweet House | మేడ్చల్ జిల్లా (Medchal District) పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వీట్ హౌప్పై ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. బాలాజీ స్వీట్ హౌస్‌లో సింథటిక్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించి, కేసు నమోదు చేశారు.
గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగించి స్వీట్స్ తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు చౌదరిగూడలోని వెంకటాద్రి టౌన్షిప్లో గల బాలాజీ స్వీట్ షాప్‌పై పోలీసులు దాడి చేశారు. స్వీట్లు, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించారు. దీంతో షాప్ నిర్వాహకుడు రాజస్థాన్‌కు చెందిన కమల్ కుడ్కుడియా (37)ను అదుపులోకి తీఉకున్నారు.
Balaji Sweet House | స్వీట్స్ స్వాధీనం
స్వీట్ హౌస్ నుంచి సింథటిక్ ఆరెంజ్, నిమ్మ-పసుపు ఫుడ్ కలర్స్, వివిధ ఫ్లేవర్లు, రోజ్ వాటర్, షుగర్ సిరప్, బాదం పాలు వంటి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 30 కిలోల కలఖండ్, 500 గ్రాముల డ్రై-ఫ్రూట్ స్వీట్లు, 2 కిలోల ఖోవా స్వీట్లు మరియు 12 కిలోల సోన్ పాప్డీని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కమల్ కుడ్కుడియాను పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించారు. స్వీట్లు కొనుగోలు చేసే ముందు వాటి తయారీ, గడువు తేదీలు, ప్యాకేజింగ్ తనిఖీ చేయాలని పోలీసులు సూచించారు.
ఇది కూడా చదవండి..: Ibrahimpatnam Road Accident | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి