అక్షరటుడే వెబ్‌డెస్క్: CaratLane Raksha Bandhan | టాటా గ్రూప్‌నకు (Tata Group )చెందిన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘క్యారట్‌లేన్’ (CaratLane) రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ఒక సరికొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. జీవితంలోని ప్రతి దశలోనూ తోడుగా ఉండే తోబుట్టువుల మధ్య అనుబంధాన్ని, ఒకరినొకరు అర్థం చేసుకునే తీరును తెలియజేస్తూ ఆహ్లాదకరమైన కథాంశంతో దీన్ని రూపొందించారు.
CaratLane Raksha Bandhan | కథా నేపథ్యం..
పీఓవీ: భాయ్ నోస్ బెస్ట్’ (‘POV: Bhai Knows Best’ )పేరిట విడుదల చేసిన ఈ వీడియోలో, ప్రముఖ నటి అష్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హాలు అన్నాచెల్లెళ్లుగా నటించారు. వీరి మధ్య ఉండే సరదా ఆటపట్టించుకోవడాలు, గిల్లికజ్జాలు , చెప్పకనే అర్థం చేసుకునే మనస్తత్వాల కలయికతో స్వచ్ఛమైన ప్రేమానురాగాలు వ్యక్తమవుతాయి. సోదరి తన మనసులోని మాటను చెప్పకముందే ఆమెకు ఏం కావాలో తమ్ముడు ఎంత చక్కగా అర్థం చేసుకోగలడో ఇందులో హృద్యంగా చూపించారు. ఆమె ఇష్టాయిష్టాలను అతను గమనించే తీరు, వారి అనుబంధాన్ని ప్రత్యేకంగా నిలిపిన జ్ఞాపకాలను ఈ సన్నివేశాలు ప్రతిబింబిస్తాయి.
CaratLane Raksha Bandhan | ప్రత్యేక ఆఫర్లు..
ఈ సందర్భంగా క్యారట్‌లేన్ మేనేజింగ్ డైరెక్టర్ సౌమెన్ భౌమిక్ మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్ల అనుబంధం వెనుక ఎన్నో ఏళ్ల సరదా జోకులు, ఆటపట్టించుకోవడాలు , లెక్కలేనన్ని చిరు జ్ఞాపకాలు దాగి ఉంటాయని, ఆ బంధాన్ని సహజంగా చూపించాలనుకున్నట్లు తెలిపారు. ఈ రక్షాబంధన్ సందర్భంగా రూ.5,000 ప్రారంభ ధరతో ప్రత్యేకంగా రూపొందించిన డైమండ్ ఆభరణాలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ బ్రాండ్ అన్ని రకాల డైమండ్ డిజైన్ల ధరలపై ఫ్లాట్ 30 శాతం తగ్గింపును అందిస్తోంది. ఆసక్తి గల వినియోగదారులు తమ సమీపంలోని క్యారట్‌లేన్ స్టోర్లలో లేదా క్యారట్‌లేన్ యాప్ , caratlane.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ఆభరణాలను పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.
ఇది కూడా చదవండి: Allu Arjun Forbes | బన్నీ క్రేజ్‌కు మరో కిరీటం.. ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్!