అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Venezuela US Oil Deal | వెనెజువెలాతో అమెరికా చరిత్రాత్మక ఆయిల్ ఒప్పందం చేసుకుంది. ఆ దేశంలోని చమురు రంగంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 65 బిలియన్ బ్యారెళ్లపై అగ్రరాజ్యం నియంత్రణ సాధించనుంది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అభివర్ణించారు.
ట్రంప్ మాట్లాడుతూ.. తమ ప్రబుత్వం వెనిజులాతో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు. ఇది కార్యరూపం దాల్చితే ఆ దేశంలోని వెలికితీయని భారీ చమురు నిల్వలను అమెరికాకు రుసుముతో పొందే వీలు కల్పిస్తుందని అన్నారు. వెనిజుల ప్రభుత్వం ఒక ప్రకటనలో, ఈ ఒప్పందంలో 65 బిలియన్ బ్యారెళ్ల నిరూపిత సామర్థ్యం గల 17 క్షేత్రాల అభివృద్ధి ఇమిడి ఉందని తెలిపింది. ఈ ఒప్పందం వెనిజులా చమురు పరిశ్రమలోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగలదని ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగ్జ్ పేర్కొన్నారు. ఇది దేశ పునరుద్ధరణపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు.
Venezuela US Oil Deal | 100 ఏళ్ల హక్కులు
ఈ ఒప్పందం ప్రకారం.. వెనిజులాలోని ప్రైవేట్ ఆపరేటర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని, నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి కొత్త ప్రైవేట్ కంపెనీని ఏర్పాటు చేయడానికి అమెరికాకు వీలు కల్పిస్తుంది. చమురు క్షేత్రాలను అభివృద్ధి చేయడానికి రోడ్రిగ్జ్ ఆ కంపెనీకి 100 సంవత్సరాల హక్కులను మంజూరు చేసినట్లు సమాచారం. కొత్త ప్రైవేట్ కంపెనీ 55శాతం వాస్తవ ఉత్పత్తి వాటాను అమెరికాకు ఇస్తుంది. వెనిజుల అప్పటి అధ్యక్షుడు నికోలస్‌ను అమెరికా నిర్బంధించిన విషయం తెలిసిందే. అనంతరం ఆ స్థానంలో తనకు అనుకూలంగా ఉన్న రోడ్రిగ్జ్‌ను కూర్చొబెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఆయిల్ ఒప్పందం కుదరడం గమనార్హం.
దీనిని కూడా చదవండి : Aug 29 Gold Prices | బంగారం ధరల భగభగ.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ఎంతంటే!