Yash Mother | నా కొడుకు టెర్రరిస్ట్​ కాదు.. అల్లు అరవింద్​ వ్యాఖ్యలకు యశ్​ తల్లి కౌంటర్​

తన కుమారుడు టెర్రరిస్ట్​ కాదని, స్వయం కృషితో పైకి వచ్చాడని యశ్​ తల్లి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Yash Mother | కన్నడ స్టార్​ హీరో యష్ నటించిన ‘టాక్సిక్’ (Toxic) ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు.

అంతేగాకుండా ఈ మూవీపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. చిత్ర నిర్మాణం, కథాంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, “KGFకి ముందు యష్ ఎవరు?” అని గతంలో నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యపై యష్ తల్లి పుష్ప అరుణ్‌కుమార్ పరోక్షంగా స్పందించారు.

యశ్​ (Hero Yash)పై విమర్శలు వస్తుండటంతో ఆయన తల్లి మీడియాతో మాట్లాడారు. KGFకి ముందు యష్ ఐదు సూపర్ హిట్ సినిమాల్లో నటించారని చెప్పారు. ఆయన ఒక సాధారణ వ్యక్తి లేదా ఎవరికీ తెలియని వ్యక్తి అయితే మీకు ఎందుకు ఆందోళన అని అల్లు అరవింద్​ను ఆమె ప్రశ్నించారు. యశ్​ ఉగ్రవాది కాదు కదా అన్నారు. KGFకి ముందు ఆయన ఎవరు అని అడగాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Yash Mother | సొంత కృషితో..

యశ్​ సంపన్న కుటుంబంలో పుట్టలేదని ఆయన తల్లి అన్నారు. బస్సు డ్రైవర్ కొడుకైన ఆయన తన సొంత కృషితో ఉన్నత స్థాయికి ఎదిగాడన్నారు. ఒక తల్లిగా నాకు ఆయన పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. కాగా అల్లు అరవింద్​ 2023లో KGF విజయం గురించి మాట్లాడుతూ… ఆ సినిమా సిరీస్‌కు ముందు యష్ ఎవరు అని ప్రశ్నించారు. ఇటీవల ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో రజత్ శర్మతో మాట్లాడుతూ యష్ ఈ వ్యాఖ్యపై స్పందించారు. తాజాగా ఆయన తల్లి సైతం అల్లు అరవింద్​కు కౌంటర్​ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Ayyappa Irumudi | రవితేజ ఇరుముడి..అసలు అయ్యప్ప భక్తుల ఇరుముడి వెనుక ఇంత మహత్యమా!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *