అక్షరటుడే, వెబ్డెస్క్: Nepal Rescue Miracle | చుట్టూ శిథిలాలు.. ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి.. గంటలు గడుస్తున్న కొద్దీ ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ.. ఓ చిన్నారి మాత్రం మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలను నిలబెట్టుకుంది. నేపాల్లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.
Nepal Rescue Miracle | చిన్నపాటి ఏడుపే ప్రాణాలను కాపాడింది..
రసువా ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకున్న ఆరేళ్ల చిన్నారి మనీషా దాదాపు 60 గంటల పాటు ప్రాణాలతో పోరాడింది. ఎటు చూసినా చీకటి, చుట్టూ శిథిలాల మధ్య చిక్కుకుపోయిన చిన్నారి.. చివరకు తన ఉనికిని తెలియజేస్తూ చేసిన చిన్నపాటి ఏడుపే ఆమె ప్రాణాలను కాపాడింది.
Kasganj road accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు యాత్రికుల దుర్మరణం.. 20 మందికి గాయాలు..
రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో చిన్నగా ఏడుపు వినిపించింది. అనుమానం వచ్చిన సిబ్బంది ఆ ప్రాంతంలో మరింత జాగ్రత్తగా శిథిలాలను తొలగించారు. కొద్దిసేపటి తర్వాత మనీషా కనిపించింది. వెంటనే ఆమెను సురక్షితంగా బయటకు తీశారు.
Nepal Rescue Miracle | 60 గంటల నిరీక్షణకు తెర
శిథిలాల నుంచి చిన్నారిని సజీవంగా బయటకు తీసిన క్షణం రెస్క్యూ సిబ్బందికి భావోద్వేగభరితంగా మారింది. ఇంతసేపు శిథిలాల కింద చిక్కుకున్నప్పటికీ మనీషా ప్రాణాలతో ఉండటం అద్భుతంగా భావిస్తున్నారు.
చిన్నారిని వెంటనే వైద్య పరీక్షలు, చికిత్స కోసం కాఠ్మాండుకు తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.