Sep 01 Market Analysis | నెగెటివ్​గా గ్లోబల్ క్యూస్..నష్టాలతో ప్రారంభం కానున్న దేశీయ మార్కెట్

గ్లోబల్ మార్కెట్లు నెగెటివ్ గా సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 01 Market Analysis | అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా దళాలు హోర్ముజ్ జలసంధి(Strait of Hormuz)లోని ఒక ద్వీపంపై దాడి చేయగా, ఇరాన్ దళాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్‌లపై దాడులు చేశాయి.

దీంతో మళ్లీ ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో గ్లోబల్ మార్కెట్లు(Global markets) నష్టాల బాటలో సాగుతున్నాయి. బలహీనమైన ప్రపంచ సంకేతాల ప్రభావంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ సైతం ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఊహించిన దానికంటే మెరుగ్గా ఉన్న మొదటి త్రైమాసిక జీడీపీ గణాంకాలు మన మార్కెట్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అనలిస్టులు భావిస్తున్నారు.

Sep 01 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.12 శాతం, ఎస్ అండ్ పీ 0.33 శాతం నష్టపోƒయాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.13 శాతం లాభంతో ఉంది.

Sep 01 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.80 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.19 శాతం నష్టంతో ముగిశాయి.

Sep 01 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.37 శాతం లాభంతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.28 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.70 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.48 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.34 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.15 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.14 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Lionel Messi Retirement | ఒక శకం ముగిసింది: అంతర్జాతీయ ఫుట్​బాల్‌కి లియోనెల్ మెస్సీ గుడ్​బై

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 7,985 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 15వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,588 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడి 95.17 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 91.01 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.49 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.78 వద్ద ఉన్నాయి.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *