Pension Protest Day | అపరిష్కృత సమస్యలపై ఉద్యోగుల నిరసన.. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ‘పెన్షన్ విద్రోహ దినం’

సీపీఎస్​ రద్దు చేసి పాత పెన్షన్​ విధానం తీసుకురావాలని ఉపాధ్యాయులు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Pension Protest Day | అపరిష్కృత సమస్యలపై ఉద్యోగులు నిరసన గళం విప్పారు. టీజీఈజేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడిజిల్లాలో ‘పెన్షన్​ విద్రోహ దినం’ను నిర్వహించారు.

Pension Protest Day | కోటగల్లీ శంకర్​భవన్​ ప్రభుత్వ పాఠశాలలో..

కోటగల్లిలోని శంకర్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పీఆర్సీని మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులు–ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులను తక్షణమే జారీ చేయాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమానికి టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ నాయకత్వం వహించారు. పాఠశాలలో విరామ సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పీఆర్సీని ప్రకటించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రభుత్వంపై వారిలో విశ్వాసం మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయన్న, టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, కార్యదర్శి గోపి, శైలేష్, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, రాజు, శ్రీహరి రావు, దామోదర్, రాజయ్య, శ్రీలక్ష్మి, శోభ, మాధవి, పావని, రజిని, విజయలక్ష్మి, రోజా, సుజాత పాల్గొన్నారు.

Pension Protest Day | నందిపేట్​, డొంకేశ్వర్​లో..

Pension Protest Day

అక్షరటుడే, నందిపేట్/డొంకేశ్వర్: పీఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు చలో హైదరాబాద్ (Hyderabad) కార్యక్రమానికి మండల ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. సీపీఎస్ రద్దు చేయాలని నందిపేట్ పీఆర్టీయూ అధ్యక్షుడు ఐల భూషణ్, డొంకేశ్వర్ పీఆర్టీయూ అధ్యక్షుడు పోచంపల్లి మోహన్ డిమాండ్​ చేశారు. ఉమ్మడి మండలాల పీఆర్టీయూ సంఘం నాయకులు ధర్నా మద్దతుగా హైదరాబాద్​కు వెళ్లారు. పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి జిందం రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమల్లో ఉన్న సీపీఎస్​ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు.

ఇది కూడా చదవండి..: Auto Driver Attack | కత్తితో ఆటోడ్రైవర్​ వీరంగం.. ఇద్దరికి గాయాలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *