అక్షరటుడే, వెబ్‌డెస్క్: Central Cabinet Decisions | కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 7 రైల్వే కారిడార్లలో నాలుగు లేన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. హౌరా-చెన్నై కారిడార్‌లో భాగంగా విశాఖ, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే నెట్వర్క్ నిర్మించనున్నారు. ముంబై-చెన్నై రైల్వే కారిడార్‌లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా 4 లేన్ల నిర్మాణం చేపట్టనున్నారు.
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను బుధవారం మంత్రి అశ్విని వైష్ణవ్ (Minister Ashwini Vaishnav) మీడియాకు వెల్లడించారు. గత 12 ఏళ్లుగా జరుగుతున్న రైల్వే ఆధునీకరణ పనులలో భాగంగా, నేటి కేబినెట్ సమావేశంలో కొన్ని అత్యంత కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం లభించిందన్నారు. మొత్తం 11,000 కిలోమీటర్ల అధిక-రద్దీ కారిడార్లలో, రైల్వే రవాణాలో సుమారు 40 శాతం వాటా కలిగిన ఏడు కీలక కారిడార్లు ఉన్నాయన్నారు. ఈ కారిడార్లలో ఇప్పటికే సుమారు 2,000 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల విస్తరణ పనులు పూర్తయ్యాయని, మరో 5 వేల కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
Central Cabinet Decisions | స్వర్ణ చతుర్భుజి
ఢిల్లీ –ముంబై, ముంబై –చెన్నై, చెన్నై –కోల్‌కతా, కోల్‌కతా నుంచి ఢిల్లీకి, ఆపై తిరిగి ముంబైకి, ఇది స్వర్ణ చతుర్భుజాన్ని ఏర్పరిచేలా రైల్వే కారిడార్ నిర్మాణం చేపడుతామని మంత్రి తెలిపారు. ఏడు అధిక జనసాంద్రత గల కారిడార్లను నాలుగు రెట్లుగా, అంటే నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సుమారు 4 వేల కిలోమీటర్ల మేర డీపీఆర్‌లు సిద్ధం చేసే దశలో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Rahul Gandhi | పంజాబ్ ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ విమర్శలు