Central Cabinet Decisions | కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. 7 రైల్వే కారిడార్లలో నాలుగు లేన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Central Cabinet Decisions | కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. 7 రైల్వే కారిడార్లలో నాలుగు లేన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. హౌరా-చెన్నై కారిడార్‌లో భాగంగా విశాఖ, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే నెట్‌వర్క్‌ నిర్మించనున్నారు. ముంబై-చెన్నై రైల్వే కారిడార్‌లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా 4 లేన్ల నిర్మాణం చేపట్టనున్నారు.

కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను బుధవారం మంత్రి అశ్విని వైష్ణవ్​ (Minister Ashwini Vaishnav) మీడియాకు వెల్లడించారు. గత 12 ఏళ్లుగా జరుగుతున్న రైల్వే ఆధునీకరణ పనులలో భాగంగా, నేటి కేబినెట్ సమావేశంలో కొన్ని అత్యంత కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం లభించిందన్నారు. మొత్తం 11,000 కిలోమీటర్ల అధిక-రద్దీ కారిడార్లలో, రైల్వే రవాణాలో సుమారు 40 శాతం వాటా కలిగిన ఏడు కీలక కారిడార్లు ఉన్నాయన్నారు. ఈ కారిడార్లలో ఇప్పటికే సుమారు 2,000 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల విస్తరణ పనులు పూర్తయ్యాయని, మరో 5 వేల కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

Central Cabinet Decisions | స్వర్ణ చతుర్భుజి

ఢిల్లీ –ముంబై, ముంబై –చెన్నై, చెన్నై –కోల్‌కతా, కోల్‌కతా నుంచి ఢిల్లీకి, ఆపై తిరిగి ముంబైకి, ఇది స్వర్ణ చతుర్భుజాన్ని ఏర్పరిచేలా రైల్వే కారిడార్​ నిర్మాణం చేపడుతామని మంత్రి తెలిపారు. ఏడు అధిక జనసాంద్రత గల కారిడార్లను నాలుగు రెట్లుగా, అంటే నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సుమారు 4 వేల కిలోమీటర్ల మేర డీపీఆర్‌లు సిద్ధం చేసే దశలో ఉన్నాయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Rahul Gandhi | పంజాబ్​ ప్రభుత్వంపై రాహుల్​గాంధీ విమర్శలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *