Sep 12 Horoscope | ఇవాళ వీరికి పని ఒత్తిడి, ఇతరులతో విబేధాలు… ఈ రాశి వారు తస్మాత్ జాగ్రత్త!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 12 Horoscope | రాశి ఫలాల ప్రకారం నేడు (శనివారం, సెప్టెంబరు 12)  వివిధ రాశుల వారికి గ్రహాల స్థితిగతులు, అనుకూలతలను బట్టి ఇవాళ మిశ్రమ ఫలితాలు అందనున్నాయి. ప్రతి రాశి వారు తమ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Sep 12 Horoscope | ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే?

మేష రాశి: Sep 12 Horoscope | నిర్లిప్తతకు, నిస్పృహకు లోనుకాకుండా ఉండాలి. ఇవాళ మీకు అనేక రకాల పెట్టుబడి , ఆర్థిక అవకాశాలు వస్తాయి కాబట్టి, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వాటి మంచి చెడ్డలను బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం. అర్హులైనవారికి వివాహ ప్రస్తావనలు వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Revanth Reddy Education | అందుకోసమే విద్యాశాఖను నా వద్ద ఉంచుకున్నా.. సీఎం రేవంత్ రెడ్డి

వృషభ రాశి: Sep 12 Horoscope | భయం అనే భావనను వీడి ఆలోచనలను సానుకూలంగా మలచుకోవాలి. చిన్నతరహా పరిశ్రమలు నడుపుతున్నవారికి సన్నిహితుల సలహాలు ఆర్ధికంగా మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి. కుటుంబ సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే చర్చించి పరిష్కరించుకోవడం ద్వారా ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

మిథున రాశి: Sep 12 Horoscope | ఇవాళ మీలో శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ సామర్థ్యాన్ని పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడానికి వినియోగించుకోండి. ధనలాభాలు మీరు ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు. సాయంత్రం వేళల్లో పిల్లలతో కలిసి ఆనందంగా గడపడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

కర్కాటక రాశి: Sep 12 Horoscope | పని ఒత్తిడి, చిన్నపాటి విభేదాలు కొంత మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఇవాళ స్త్రీ, పురుషులు పరస్పర సహాయసహకారాలతో వ్యాపార రంగంలో మంచి లాభాలను గడించగలరు. మీ సరదా స్వభావం సమావేశాలలో మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది.

సింహ రాశి: Sep 12 Horoscope | మీ సానుకూల దృక్పథం , ఆత్మవిశ్వాసంతో ఇతరులను ఇట్టే ఆకట్టుకోగలరు. అయితే ఇవాళ రుణాలు తీర్చమని ఒత్తిడి రావచ్చు కాబట్టి అప్పులు చేయకుండా ఉండటం మంచిది. ఇతరులను కించపరచకుండా మీ కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి.

కన్యా రాశి: Sep 12 Horoscope | ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. త్వరగా డబ్బు సంపాదించాలనే కోరిక కలిగినప్పటికీ, అంతా మీ కష్టపడే తత్వంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఇవాళ ఎంతో ఆనందకరంగా ఉంటుంది. మీ సృజనాత్మకత మిమ్మల్ని లాభాల బాటలో నడిపిస్తుంది.

తులా రాశి: Sep 12 Horoscope | మీ ముఖంలో చిరునవ్వు కొత్తవారితో కూడా పరిచయాలను ఏర్పరుస్తుంది. ఆర్థికపరమైన కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. మిత్రులతో గడిపే సాయంత్రాలు మీకు ఉద్వేగభరితమైన ఉత్సాహాన్ని అందిస్తాయి. సామాజిక మాధ్యమాలలో సమయాన్ని వృథా చేసుకోకండి.

వృశ్చిక రాశి: Sep 12 Horoscope | ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తుల ద్వారా అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. తెలివిగా చేసిన పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి. బంధువులతో ఉన్న బంధాలను మరింత గట్టిపరుచుకునే రోజు ఇది.

ధనుస్సు రాశి: ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పిల్లల అమాయకత్వం , ఆహ్లాదకరమైన స్వభావం నుంచి ఎంతో నేర్చుకుంటారు. మీ జీవిత భాగస్వామితో ప్రేమసాగరంలో మునిగి తేలుతూ అద్భుతమైన క్షణాలను గడుపుతారు.

మకర రాశి: గర్భిణులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలంకారాలు, ఆభరణాలపై చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే ఈ రాశివారు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరుచుకోవడానికి ఉపయోగిస్తారు.

కుంభ రాశి: మీలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. భయం, అసూయ, పగ వంటి నెగెటివ్ భావోద్వేగాలను దూరం పెట్టండి. ఇతరుల సహాయం లేకుండానే మీ స్వశక్తితో ధనార్జన చేయగలరు.

మీన రాశి: పరిస్థితులపై అదుపు సాధించగానే మీలో ఉండే ఆతృత, భయాలు మాయమవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి పట్ల మరింత జాగ్రత్తతో వ్యవహరించాలి. మీకు ఇష్టమైన వ్యక్తి ప్రవర్తన కొంత చిరాకు తెప్పించినప్పటికీ, మీ భాగస్వామితో మంచిగా సమయాన్ని గడపడం చాలా ముఖ్యం.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *