అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Semiconductor Industry | తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని సింగపూర్ ప్రతనిధులు తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ అయ్యారు.
మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్స్ సిటీ అభివృద్ధి అంశాలను సింగపూర్ ప్రతినిధులకు సీఎం వివరించారు. తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమం గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ను పర్యాటకంగానే కాకుండా నాలెడ్జ్ హబ్‌గా మారుస్తామన్నారు. ఇప్పటికే హార్వార్డ్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, MIT, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ ఆఫ్ షోర్ క్యాంపస్‌లను నగరంలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయని చెప్పారు.
Telangana Semiconductor Industry | అభివృద్ధికి సహకరించాలి
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, అభివృద్ధికి సహకారం అందించాలని సీఎం సింగపూర్ ప్రతినిధులన కోరారు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులను ఫ్యూచర్ సిటీలో డిసెంబరులో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం ఆహ్వానించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: iBomma Ravi | కుటుంబ పోషణ భారమైంది.. నాంపల్లి కోర్టును ఆశ్రయించిన ఐబొమ్మ రవి