అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Abhishek Sharma Century | ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ 20లో భారత్ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశారు.
మూడు టీ 20ల సిరీస్‌లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న మూడో టీ 20లో టాస్ గెలిచిన ఆఫ్గాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆది నుంచే భారత బ్యాటర్లు ఆ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించారు.
Abhishek Sharma Century | ఫాస్టెస్ట్ సెంచరీ
ఓపెనర్ అభిషేక్ శర్మ ఆఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రతి బంతిని బౌండరీకి తరలించాడు. దీంతో ఫీల్డర్లు ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు. 30 బంతుల్లోనే 100 పరుగుల పూర్తి చేసుకున్నాడు. మొత్తం 34 పరుగుల్లో 108 రన్స్ చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. అనంతరం రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఐసీసీ ఫుల్ మెంబర్స్ టీమ్స్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. అభిషేక్‌కు ఇది మూడో టీ 20 శతకం. భారత్ నుంచి గతంలో రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేయగా.. తాజాగా అభిషేక్ దానిని బ్రేక్ చేశాడు. సంజు శాంసన్ సైతం వేగంగా ఆడటంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 12.2 ఓవర్లకు భారత్ రెండు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. క్రీజులో శాంసన్ శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.
WHAT A KNOCK! 💯
Abhishek Sharma brings up his hundred in just 30 balls.🔥
pic.twitter.com/QVVt4kRXOm— 😎 (@_VK86) September 17, 2026
దీనిని కూడా చదవండి : Police Exam Dates | పోలీస్ ఉద్యోగాల పరీక్ష తేదీలు విడుదల