అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyundai Explorers Carnival | హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన ఫ్లాగ్షిప్ కస్టమర్ ఎంగేజ్మెంట్ వేడుక అయిన ‘హ్యుందాయ్ ఎక్స్‌ప్లోరర్స్ కార్నివాల్ 2026’ మూడో విడతను ప్రకటించింది. హ్యుందాయ్ కస్టమర్లు, వారి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతా భావాన్ని పెంపొందించేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. రివార్డింగ్ ఓనర్షిప్ జర్నీని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ మల్టీ-సిటీ కార్నివాల్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
Hyundai Explorers Carnival | హ్యుందాయ్ ఎక్స్‌ప్లోరర్స్ కార్నివాల్ ..
హ్యుందాయ్ కస్టమర్లు , వారి కుటుంబాలు ఒకచోట చేరి కలిసికట్టుగా గడపడానికి, పరస్పరం అనుసంధానం కావడానికి ఇది హెచ్ఎంఐఎల్ (HMIL) యొక్క ప్రధాన కస్టమర్ ఎంగేజ్మెంట్ వేదిక. బహుళ నగరాల్లో విభిన్న కార్యకలాపాలు, పరస్పర చర్ల ద్వారా కస్టమర్ల ప్రయాణాన్ని వాహన కొనుగోలుకు మాత్రమే పరిమితం చేయకుండా, వారితో బలమైన కమ్యూనిటీ బంధాన్ని ఏర్పరచడానికి ఇది దోహదపడుతుంది. ఈ ఏడాది జరుగుతున్న ఈ కార్నివాల్ దీని మూడో సీజన్ కావడం విశేషం.
Hyundai Explorers Carnival | ఎప్పుడెప్పుడు జరుగుతుంది?
ఈ ఏడాది (2026) అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఐదు ప్రధాన నగరాల్లో ఈ హ్యుందాయ్ ఎక్స్‌ప్లోరర్స్ కార్నివాల్ వేడుకలు జరగనున్నాయి. అక్టోబర్ 3, 2026న పూణె వేదికగా ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. పూణెతో పాటు లక్నో, లుథియానా, భువనేశ్వర్ , హైదరాబాద్ నగరాల్లో ఈ కార్నివాల్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునే కస్టమర్లు https://hyundaiexplorers.com/carnival-drive వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
Hyundai Explorers Carnival | లభించే ప్రత్యేకతలు ..https://hyundaiexplorers.com/carnival-drive
కస్టమర్లు , వారి కుటుంబాల కోసం వినోదం, ఎంగేజ్మెంట్తో కూడిన పలు ఆకర్షణీయమైన కార్యక్రమాలను ఇందులో ఏర్పాటు చేశారు. కుటుంబ వినోదం కోసం ఇంటరాక్టివ్ గేమ్స్ , సరదా కార్యకలాపాలు ఉంటాయి. అలాగే లైవ్ అనుభవాల ద్వారా అద్భుతమైన ప్రదర్శనలు, ఆన్-గ్రౌండ్ అట్రాక్షన్స్ ఆకట్టుకుంటాయి. ఫుడ్ & హాస్పిటాలిటీ విభాగంలో రుచికరమైన ఫుడ్ అనుభవాలను పొందవచ్చు. తోటి హ్యుందాయ్ ఓనర్లతో కనెక్ట్ అయ్యే అవకాశం కస్టమర్ కమ్యూనిటీ ద్వారా లభిస్తుంది. చివరిగా, హాజరయ్యే వారికి ప్రత్యేక సర్ప్రైజ్లుగా ఎక్స్‌క్లూజివ్ రివార్డులు , పలు కార్యకలాపాలు ఉంటాయి.
Hyundai Explorers Carnival | కస్టమర్ బంధమే మా లక్ష్యం..
ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా నేషనల్ సర్వీస్ హెడ్ నీలేశ్ షా మాట్లాడుతూ.. కస్టమర్లకు అర్థవంతమైన అనుభవాలను అందించడమే హ్యుందాయ్ ఫిలాసఫీ అని తెలిపారు. వాహన కొనుగోలుతోనే బంధం ఆగిపోకుండా, కస్టమర్లతో సుదీర్ఘ సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఈ ఎక్స్‌ప్లోరర్స్ కార్నివాల్ వేదికవుతోందని పేర్కొన్నారు. మారుతున్న కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా, కేవలం కార్ల అమ్మకాలకే పరిమితం కాకుండా కస్టమర్లతో బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడమే లక్ష్యంగా హ్యుందాయ్ ఈ మూడో విడత కార్నివాల్‌ను నిర్వహిస్తోంది.
ఇది కూడా చదవండి: Sthree Nidhi Electric Autos | మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ