Madhapur OYO Hotel Murder| మాదాపూర్‌ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగు చూసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Madhapur OYO Hotel Murder | హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగు చూసింది. సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్ 5లోని ఓయో హోటల్‌లో విశాఖపట్నానికి చెందిన షారన్ నిఖిత టోప్నో అనే యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఆమెను ప్రియుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Madhapur OYO Hotel Murder | యువతి అపస్మారక స్థితికి..

విశాఖపట్నానికి చెందిన షారన్ నిఖిత, తన ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి నగరానికి చేరుకుంది. అనంతరం ఓయో యాప్ ద్వారా సదరు హోటల్‌లోని రూమ్ నంబర్ 303ను అద్దెకు తీసుకుని ఇద్దరూ బస చేశారు. అయితే తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో యువతి అపస్మారక స్థితికి చేరుకోవడంతో, ప్రియుడు శ్రీనివాస రవి తేజ హోటల్ సిబ్బంది సహాయంతో కొండాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆసుపత్రికి చేరేసరికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చిచెప్పారు.

Madhapur OYO Hotel Murder |తీవ్రమైన గాయాలు..

యువతి మృతి చెందినట్లు తెలియగానే నిందితుడు శ్రీనివాస రవి తేజ ఆసుపత్రి సిబ్బంది కంటపడకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే ఆసుపత్రితో పాటు హోటల్‌ను తనిఖీ చేశారు. మృతురాలి ముఖం, తలపై తీవ్రమైన గాయాలు, వాపులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే హోటల్ గదిలోని గోడలపై, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు ఉండటంతో ఇది హత్యేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ , ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో గదిలో కీలక ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు శ్రీనివాస రవి తేజ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి:  TG Safe Inspections | డెయిర్​ యూనిట్లలో టీజీ సేఫ్​ అధికారుల తనిఖీలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *