Armoor Integrated Offices | ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ కార్యాలయాలు..: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర అందుబాటులో ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,ఆర్మూర్ : Armoor Integrated Offices | అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర అందుబాటులో ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) అన్నారు. ఇటీవల ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Armoor Integrated Offices | వ్యవసాయ మార్కెట్ స్థలం పరిశీలన

ఈ క్రమంలో ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ ముందున్న వ్యవసాయ మార్కెట్ స్థలాన్ని అధికారులు, నాయకులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంతోపాటు వివిధ గ్రామాల ప్రజలు బస్టాండ్లో దిగి రోడ్డు దాటేగానే అన్ని కార్యాలయాలు ఒకే వద్ద ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే సూచించారు. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డును ఆర్మూర్ మున్సిపల్ శివారులో ని డిగ్రీ కళాశాల ప్రాంతంలో అన్ని రకాల హంగులతో ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రెవెన్యూ కు సంబంధించిన కార్యాలయాన్ని ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, పట్టణ పోలీస్ స్టేషన్ అన్ని ఒకే దగ్గర ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Armoor Integrated Offices | ఆర్మూర్​ అభివృద్ధికి..

ఆర్మూర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్ని విదాల సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని, మరిన్ని అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపునకు సానుకూలంగా ఉన్నారన్నారు . కార్యాలయాల ఏర్పాటుపై ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్​ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ తహశీల్దార్ సత్యనారాయణ, బీజేపీ నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి,రంగన్న, పోల్కం వేణు, ఉదయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: GGH Service Book Collections | రూ.6వేలు కొట్టు.. సర్వీస్​ బుక్​ పట్టు.. జీజీహెచ్​లో దర్జాగా వసూళ్లు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *