Congress Thousand Days | రాష్ట్రంలో కాంగ్రెస్​ను నమ్మే పరిస్థితి లేదు : మాజీ ఎమ్మెల్యే షకీల్​

హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్​ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: Congress Thousand Days | హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్​ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Ex MLA Shakeel)​ పేర్కొన్నారు. కాంగ్రెస్​ వెయ్యి రోజుల పాలన సందర్భంగా బోధన్ (Bodhan)​ పట్టణంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

Congress Thousand Days | బోధన్​ చౌరస్తాలో..

కాంగ్రెస్​ వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా బోధన్ అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్​ఎస్​ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. షకీల్​ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఆచరణలో సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని.. వెయ్యి రోజులు గడుస్తున్నా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్​ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని షకీల్ పేర్కొన్నారు. 420 మీటర్ల కాంగ్రెస్ అబద్ధపు హామీల ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, సీనియర్ నాయకులు గిరిధర్ గంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: TGSRTCలో కండక్టర్​ పోస్టులు..! 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *