Esha Singh Silver Medal | షూటింగ్​లో రజతం సాధించిన ఈషా సింగ్​

ఆసియా గేమ్స్​లో భారత ప్లేయర్​ ఈషా సింగ్​ మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Esha Singh Silver Medal | ఆసియా గేమ్స్​ (Asian Games)లో భారత ప్లేయర్​ ఈషా సింగ్​ మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది. దీంతో భారత ఖాతాలో 39 పతకాలు చేరాయి.

Esha Singh Silver Medal | షూట్​ ఆఫ్​లో ఓడిపోవడంతో..

ఉత్తర కొరియాకు చెందిన కిమ్ హ్యోన్ సుక్‌తో హోరాహోరీగా సాగిన షూట్-ఆఫ్‌లలో నెగ్గి ఫైనల్​కు చేరుకున్న ఈషా.. ఫైనల్లో రెండో స్థానంతో సరి పెట్టుకుంది. మొదట ఆమె చైనాకు చెందిన జియావోతో సమానంగా 38 పాయింట్లు సాధించింది. దీంతో గోల్డ్​ మెడల్​ కోసం నిర్వహించిన షూట్​ అవుట్​లో ఆమె ఓడిపోయింది. ఫలితంగా రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఆసియా క్రీడలలో సింగిల్స్ పిస్టల్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం. ఇదే విభాగంలో భారత ఒలింపిక్​ క్రీడాకారిణి మను భాకర్​ ఫైనల్​కు అర్హత సాధించలేకపోయింది. షూటింగ్​లో భారత్​ ఇప్పటివరకు 12 పతకాలు గెలిచింది.

ఇది కూడా చదవండి..: India Asian Games Medal | ఆసియా గేమ్స్​లో భారత్​కు మరో పతకం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *