అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Neeru Danda Gold | ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణం గెలిచింది. ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండా మంగళవారం గోల్డ్ మెడల్ గెలుచుకుంది.
నీరు దండా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. మంగళవారం ఉదయం టీమ్ ఈవెంట్‌లో మరో ఇద్దరితో కలిసి సిల్వర్ మెడల్ సాధించిన ఆమె.. అనంతరం వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఈవెంట్‌లో చైనా క్రీడాకారిణి సున్ యునాంగ్ కంటే మెరుగైన ప్రదర్శనతో నీరు మొదటి స్థానంలో నిలిచింది. దీంతో భారత్ ఖాతాలో ఐదు స్వర్ణాలు చేరాయి. షూటింగ్లో ఇదే తొలి గోల్డ్ మెడల్ కావడం గమనార్హం. వర్షం కురుస్తున్న నీరు ఏకాగ్రత కోల్పోకుండా ప్రదర్శన చేయడం గమనార్హం.
Neeru Danda Gold | మొదటి స్వర్ణం..
ఈ ఆసియా క్రీడ (Asian Games)లలో వ్యక్తిగత మహిళల షూటింగ్ విభాగంలో భారతదేశానికి లభించిన మొదటి స్వర్ణ పతకం ఇదే. 1978 క్రీడలలో పురుషుల వ్యక్తిగత ట్రాప్ ఈవెంట్‌లో రణధీర్ సింగ్ భారతదేశానికి స్వర్ణ పతకం అందించాడు. 2010 ఎడిషన్‌లో రొంజన్ సోధి పురుషుల డబుల్ ట్రాప్ వ్యక్తిగత స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. తాజాగా హర్యానా షూటర్ నీరు దండా స్వర్ణం గెలుచుకొని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఆమె ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉంది. ఇటలీలో జరిగిన షాట్‌గన్ ప్రపంచ కప్‌లో ట్రాప్ ఈవెంట్‌లో ప్రపంచ కప్ స్వర్ణ పతకం గెలుచుకుంది.
ఇది కూడా చదవండి..: Asian Games Shooting | షూటింగ్లో భారత్‌కు మరో రజతం