అక్షరటుడే వెబ్‌డెస్క్: Rahul Gandhi Form 6 | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ సందర్భంగా ‘ఫారం-6’లో చేసిన మార్పులపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ ఫారం-6ను చట్టవిరుద్ధంగా మార్చారంటూ ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ECI) ప్రశ్నలతో నిలదీశారు.
Rahul Gandhi Form 6 | రాహుల్ గాంధీ ప్రశ్నలు..
ఆన్లైన్ ఫారం 6ను చట్టవిరుద్ధంగా ఎందుకు మార్చారని రాహుల్ గాంధీ నిలదీశారు. ఈసీ సొంత కమిషనర్లే ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థకు ఆ మార్పు చేయమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు? టీసీఎస్‌లో దానికి ఎవరు ఆమోదం తెలిపారు? అలా చేయడానికి వారిపై ఎవరిదైనా ఒత్తిడి ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
Rahul Gandhi Form 6 | అదనపు డిక్లరేషన్ వివాదం..
ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ ముగిసిన రాష్ట్రాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఇక నుంచీ ఫారం-6 కు అదనంగా డిక్లరేషన్ ఫారాన్ని నింపడాన్ని ఈసీ అధికారికంగా ఉపసంహరించుకుంది. అంతకు ముందు ఎస్ఐఆర్ సందర్భంగా కొత్త ఓటర్లు తమ తండ్రి, తాతల పేర్లను వెల్లడించాలని పేర్కొంటూ ఫారం-6కు అదనంగా డిక్లరేషన్‌ను ఈసీ జోడించింది. ఎస్ఐఆర్ సందర్భంగా తీసుకొచ్చిన ఈ నిబంధనపై ఇద్దరు కమిషనర్లు ఎస్ఎస్ సంధూ, వివేక్ జోషి అభ్యంతరం వ్యక్తం చేశారంటూ ఓ జాతీయ పత్రికలో పరిశోధనాత్మక కథనం ప్రచురితమైంది. దీంతో ఈ అంశంపై జాతీయ స్థాయిలో తీవ్ర వివాదం తలెత్తింది.
Rahul Gandhi Form 6 | తొలగింపు ప్రక్రియ..
ఈ పరిణామాల నేపథ్యంలో సమావేశమైన ఎన్నికల సంఘం.. ఎస్ఐఆర్ (SIR) కోసమే ఆ ఫారాన్ని తెచ్చామని, అది అమల్లో లేని సమయంలో 1960 నాటి ఓటరు నమోదు నిబంధనలకు అనుగుణంగా ఫారం-6ను నింపితే చాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఎస్ఐఆర్ ముగిసిన ప్రాంతాల్లో ఈసీఐనెట్ పోర్టల్, యాప్‌లతో పాటు సీఈఓ వెబ్సైట్ల నుండి కూడా ఈ డిక్లరేషన్‌ను తొలగించినట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Tandur Boxing Student | రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు తాండూర్ విద్యార్థి