Simran Patel Arrest | గాంధీజీని అవమానించేలా రీల్.. మహిళ అరెస్ట్​

మహాత్మా గాంధీజీని అవమానించేలా రీల్​ పోస్ట్ చేసిన మహిళను ​ పోలీసులు అరెస్ట్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Simran Patel Arrest | మహాత్మా గాంధీజీని అవమానించేలా రీల్​ పోస్ట్ చేసిన మహిళను ​ పోలీసులు అరెస్ట్​ చేశారు. గుజరాత్‌ (Gujarat)లోని సూరత్‌లో గాంధీ చిత్రం ఉన్న రూ. 500 నోటును అభ్యంతరకర రీతిలో పట్టుకున్నట్లుగా ఒక రీల్‌ను పోస్ట్ చేసినందుకు ఒక కంటెంట్ క్రియేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సిమ్రాన్ పటేల్‌ అనే మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో పది లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె నగరంలోని అడజన్ ప్రాంతంలో నివసిస్తుంది. అక్టోబర్ 1న సోషల్​ మీడియాలో ఒక వీడియో పోస్టు చేసింది. ఆ వీడియోలో ఆమె గాంధీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంతో పాటు అభ్యంతకరంగా నోటును పట్టుకుంది. ఈ వీడియో వైరల్​ కావడంతో పోలీసులు స్పందించారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Simran Patel Arrest | క్షమాపణ చెప్పిన సిమ్రాన్​

అరెస్ట్ అనంతరం సిమ్రాన్ పటేల్ క్షమాపణలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు పోస్ట్ చేశారు. సామాజిక కార్యకర్త అయిన ధర్మేష్ గామి, పటేల్ రీల్ గురించి సూరత్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు. సామాజిక అశాంతికి కారణమయ్యే అవకాశం ఉన్న విషయాలను పోస్ట్ చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి: Delhi Riots Petition | ఢిల్లీ అల్లర్లపై పిటిషన్​ను కొట్టేసిన హైకోర్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *