అక్షరటుడే వెబ్‌డెస్క్: Battis Wali Smile | నెల చివరి రోజు రాగానే అందరి మదిలో మెదిలే ప్రశ్న.. 31 తర్వాత ఏం వస్తుంది? సాధారణంగా అందరూ ‘1వ తేదీ’ అని సమాధానం చెబుతారు. కానీ బంధన్ మ్యూచువల్ ఫండ్ (మాత్రం దీనికి భిన్నంగా ’32’ అంటోంది. అదేంటి క్యాలెండర్‌లో 32వ తేదీ ఉండదు కదా అనుకుంటున్నారా? అక్కడే అసలు విషయం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
Battis Wali Smile | ‘బత్తిస్ వాలీ స్మైల్’..
ప్రతి నెల 31వ తేదీ రాగానే ఉద్యోగుల్లో కనిపించే అత్యంత సంతోషకరమైన క్షణం ‘జీతం జమ అయింది’ (Salary Credited) అనే మెసేజ్ రావడం. ఆ సందేశం చూడగానే ముఖంలో వచ్చే పెద్ద చిరునవ్వే ‘బత్తిస్ వాలీ స్మైల్’ (Battis Wali Smile). తన ‘శాలరీ వాలా ప్లాన్’ (Salary Wala Plan) ప్రచారంలో భాగంగా బంధన్ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఈ సరికొత్త కాన్సప్ట్‌తో ఒక వీడియోను విడుదల చేసింది. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) లాంటి ఆర్థిక విషయాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు ఇందులో హాస్యాన్ని జోడించారు.
జీతాలు వేర్వేరుగా ఉండవచ్చు, వృత్తులు మారవచ్చు, లేదా జీవిత దశలు వేరుగా ఉండవచ్చు.. కానీ ఖాతాలో డబ్బు పడినప్పుడు కలిగే సంతోషం మాత్రం అందరికీ ఒకేలా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, రిటైర్డ్ అయినవారు అనే తేడా లేకుండా అందరూ ఈ అనుభూతిని ఆస్వాదిస్తారు. ఈ భావోద్వేగాన్ని SWPకి ముడిపెడుతూ బంధన్ మ్యూచువల్ ఫండ్ ఈ క్యాంపెయిన్‌ను రూపొందించింది.
Battis Wali Smile | SWP అంటే ఏంటి?
ఈ ప్రచారం గురించి బంధన్ ఏఎంసీ సీఈఓ విశాల్ కపూర్ మాట్లాడుతూ.. “క్రమం తప్పకుండా డబ్బు అందడం వల్ల కలిగే ఆనందాన్ని అందరూ అర్థం చేసుకుంటారు. ఈ భావనను SWPలకు అనుసంధానించడం ద్వారా, పెట్టుబడిదారులు తమ మ్యూచువల్ ఫండ్స్ ( Mutual Fund ) నుంచి నిర్ణీత కాలంలో ఒక స్థిరమైన మొత్తాన్ని పొందేలా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. అదే సమయంలో మిగిలిన పెట్టుబడి అలాగే ఉండి వృద్ధి చెందుతుంది” అని తెలిపారు.
Battis Wali Smile | ‘ఆల్ ఇన్’ ఏజెన్సీ క్రియేటివిటీ..
‘ఆల్ ఇన్’ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఈ వీడియోను రూపొందించింది. ఈ ప్రచారంలో భాగంగా.. రోజువారీ పరిస్థితుల్లో “31 తర్వాత 32 వస్తుంది” అంటూ ఒక వ్యక్తి అందరినీ గందరగోళానికి గురిచేయడం, చివరికి అసలు విషయం (జీతం పడిన తర్వాత వచ్చే చిరునవ్వు) చెప్పడం చాలా హాస్యభరితంగా చూపించారు. సాధారణంగా సంక్లిష్టంగా భావించే మ్యూచువల్ ఫండ్స్ , ఎస్‌డబ్ల్యూపీ (SWP) విధానాలను ప్రజలకు అత్యంత సులభంగా చేరువ చేయాలనే ఉద్దేశంతో బంధన్ మ్యూచువల్ ఫండ్ తీసుకువచ్చిన ఈ ‘బత్తిస్ వాలీ స్మైల్’ క్యాంపెయిన్ ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇది కూడా చదవండి: Dasara Special Buses | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 7 వేల స్పెషల్ బస్సులు