RTC Union Elections | ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ కూటమి ప్రభంజనం

కామారెడ్డి జిల్లాలో జరిగిన తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ కూటమి సత్తా చాటింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: RTC Union Elections | కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో జరిగిన తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ కూటమి సత్తా చాటింది. జిల్లాలోని రెండు డిపోల్లోనూ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది.

RTC Union Elections | కామారెడ్డి డిపోలో..

కామారెడ్డి డిపోలో మొత్తం 408 ఓట్లు ఉండగా 395 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో కూటమికి 298 ఓట్లు వచ్చాయి. టీడబ్ల్యుయూకు 74 ఓట్లు, టీజేఎంయూకు18 ఓట్లు, బీఎంఎస్ కు 4, సామాజిక తెలంగాణకు 1 ఓటు వచ్చాయి. దాంతో కూటమి యూనియన్ ఘనవిజయం సాధించింది. ఇక బాన్సువాడ డిపోలో కూడా ఇదే హవా కొనసాగింది. ఇక్కడ మొత్తం 315 ఓట్లకు 312 ఓట్లు పోలవగా, ఈయూ/టీఎంయూ కూటమికి 252 ఓట్లు వచ్చాయి. బిఎంఎస్ కు 49 ఓట్లు టీజేఎంయూకి 10 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లనిదిగా ప్రకటించారు. దాంతో బాన్సువాడలో కూడా కూటమి విజయకేతనం ఎగురవేసింది. రెండు డిపోల్లోనూ కార్మికులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, కార్మికుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి కృషి చేస్తామని కూటమి నాయకులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Paddy Purchase | రైతులకు శుభవార్త.. నిజామాబాద్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *