Rice Mill CMR Scam | తవ్వినకొద్దీ బయటపడుతున్న రైస్​మిల్లర్ల అక్రమాలు.. సీఎంఆర్​ ఇవ్వని రైస్​మిల్​పై కేసు నమోదు

నిజామాబాద్​ జిల్లాలో సీఎంఆర్​ ఇవ్వని రైస్​మిల్లులపై వరుస కేసులు నమోదవుతున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Rice Mill CMR Scam | జిల్లాలో (Nizamabad) సీఎంఆర్​ ఇవ్వని రైస్​మిల్లులపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నగర శివారులోని సాయి రాజలక్ష్మి ఇండస్ట్రీస్​ రైస్​మిల్లుపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు రూరల్​ ఎస్​హెచ్​వో వివరాలు అందజేశారు.

Rice Mill CMR Scam | సివిల్​ సప్లయ్​.. విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు..

నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలోని సాయి రాజలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్​మిల్లులో ఆగస్టు 13న పౌరసరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. రబీ 2022-23 ఖరీఫ్ 2025-26 సీజన్లకు సంబంధించి మొత్తం 3,593.452 మెట్రిక్ టన్నుల సీఎంఆర్​ కొరత ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిలు, పెనాల్టీ తదితర మొత్తాలు కలిపి రూ.8,34,48,130/- ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

మిల్లర్ రూ.70లక్షలు చెల్లించినప్పటికీ, సంబంధిత రికార్డుల ప్రకారం బకాయిలు రూ.కోట్లల్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి, ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి సీఎంఆర్​ (CMR) బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా సదరు రైస్​మిల్​ ఇవ్వలేదు. దీంతో రైస్​మిల్​ మేనేజింగ్ పార్టనర్లు డి.హనుమంతరావు, డి. రాజేందర్​లపై కేసు నమోదైంది. అలాగే ఈ లావాదేవీల్లో ఇతరుల పాత్రపై విచారణ చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు రవి ప్రకాష్, యాంకర్ ఉదయభాను, సంగీత దర్శకుడు ఆర్ఫీ పట్ నాయక్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *