Tahsildar Suspended | రైతును అవమానించిన గజ్వేల్​ తహశీల్దార్​పై వేటు

రైతును అవమానించిన గజ్వేల్​ తహశీల్దార్ స్వామిని అధికారులు సస్పెండ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tahsildar Suspended | రైతును అవమానించిన గజ్వేల్ (Gajwel)​ తహశీల్దార్​పై అధికారులు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్​ హైమావతి తహశీల్దార్​ చిట్టంపల్లి స్వామిని సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తన భూ సమస్య పరిష్కరించాలని వెళ్లిన రైతుతో తహశీల్దార్​ స్వామి అనుచితంగా మాట్లాడారు. సదరు రైతు లేచి తన సమస్య చెప్పుకోవడానికి యత్నించగా ఆయన ‘‘నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగి చనిపోలేదా”అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా రైతు బాధను చూసి నవ్వారు. నవ్వు వస్తుందా సార్​ అని అడిగితే.. ‘వస్తది.. బరాబార్​ వస్తదని’ సమాధానం చెప్పాడు.

Tahsildar Suspended | వీడియో వైరల్ కావడంతో..

గజ్వేల్​ తహశీల్దార్​ స్వామి రైతును అవమానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్డీవో (RDO) ప్రాథమిక నివేదిక ఆధారంగా కలెక్టర్​ హైమావతి తహశీల్దార్​ను సస్పెండ్​ చేశారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. కాగా చాలా మంది రైతులు తమ సమస్యల కోసం నిత్యం తహశీల్దార్​ కార్యాలయాలకు వెళ్తుంటారు. చెప్పులు అరిగేలా తిరిగిన పనులు కాని వారు ఉన్నారు. అలాంటి వారి విషయంలో తహశీల్దార్​ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారనే విమర్శలు ఉన్నాయి. రైతులకు సేవ చేయాల్సిన అధికారులు వారిని చులకనగా మాట్లాడటంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా వీడియో వైరల్ కావడంతోనే అధికారులు చర్యలు తీసుకున్నారు. లేదంటే పట్టించుకునే వారు కాదని పలువురు విమర్శిస్తున్నారు.

 

దీనిని కూడా చదవండి : Riyadh Airport Attack | సౌదీ ఎయిర్​పోర్టుపై దాడిని ఖండించిన భారత్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *