అక్షరటుడే, వెబ్‌డెస్క్: Riyadh Airport Attack | సౌదీ అరేబియా (Saudi Arabia) రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిని ఆదివారం భారత్ ఖండించింది.
Riyadh Airport Attack | క్షిపణి దాడిలో..
క్షిపణి దాడిలో 12 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కావని భారత్ పేర్కొంది. రియాద్‌లోని కింగ్ ఖలీద్ విమానాశ్రయంపై (King Khalid International Airport) జరుగుతున్న దాడులను, అక్టోబర్ 10న జరిగిన దారుణమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. సౌదీ సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి తాము సంఘీభావంగా నిలుస్తామని విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది.
Riyadh Airport Attack | హౌతీల పని..
మృతులలో నలుగురు సౌదీ పౌరులతో పాటు ఇద్దరు బంగ్లాదేశీయులు, ఒక పాలస్తీనియన్, ఒక అమెరికా పౌరుడు, ఒక ఈజిప్షియన్, ఒక జోర్డాన్ దేశస్థుడు, ఒక సిరియన్, సూడాన్‌కు చెందిన ఒకరు ఉన్నారు. యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులే ఈ దాడికి కారణమని సౌదీ ఆరోపించింది. కాగా గత దశాబ్ద కాలంలో సౌదీపై జరిగిన పెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రియాద్ నుండి అన్ని విమానాలను దారి మళ్లించారు. ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇది కూడా చదవండి: బతుకమ్మ ప్రసాదాల వెనుక ఆరోగ్య రహస్యాలు!